ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకతో పలు పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. అయితే ఓ విద్యార్థి మాత్రం ఏడుస్తూనే పరీక్షకు హాజరయ్యాడు. విధి అతడితో వింత నాటకం ఆడింది. వివరాల్లోకి వెళితే
విధి ఎంతటి విషాదాన్నైనా నింపేయగలదు. ఆనందంగా ఉంటున్న కుటుంబాలకు ఊహించని విధంగా పరీక్ష పెడుతోంది. ఇంట్లో పుట్టెడు దు:ఖాన్ని నింపి సంబరపడుతోంది. ఈ విధే ఆ కుటుంబంతో ఆటలాడింది. అసలు ఏమైందంటే..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకతో పలు పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. తెలంగాణలో పరీక్షా సమయానికి ఐదు నిమిషాల తర్వాత వరకు అనుమతి ఉంది. అయితే ఏపీలో మాత్రం ఒక్క నిమిషం నిబంధన ఉండటంతో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. తొలి పరీక్ష కావడంతో పరీక్షా కేంద్రాల విషయంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులు విడిచి పెడుతున్నారు.
అయితే ఓ విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసేందుకు సన్నద్దమవుతుండగా.. అతడి ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో అతడి తండ్రి చనిపోయాడన్న వార్త వినాల్సి వచ్చింది. అయినప్పటికీ పంటి బిగువున దు:ఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసేందుకు వచ్చాడు ఆ విద్యార్థి. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో జరిగింది. ఏడ్చుకుంటూనే పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయం తెలిసిన అక్కడి వారు సైతం చిన్నబోయారు. అటు అనంతపురం జిల్లాలో టెన్త్ ఎగ్జామ్ సప్లిమెంటరీ రాసేందుకు వెళ్తున్నవిద్యార్థి ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలైయ్యాయి. స్థానికులు ఇద్దరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి గాయాలతో బయటపతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.