దేశంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు దాదాపు లేదు. స్మార్ట్‌ఫోన్ లేనివారు కనీసం ఫీచర్ ఫోన్ అయినా వాడుతున్నారు. అందుకే భారత్‌లో మొబైల్ వినియోగదారులు భారీగా ఉన్నారు. దేశజనాభా దాదాపు 140 కోట్లకు పైనే అనుకుంటే.. వీరిలో 120 కోట్ల మందికి పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో స్మార్ట్ ఫోన్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య 60 కోట్లపైనే ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. అయినప్పటికీ రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చి చేరుతోంది. లుక్ పరంగానో.. ఫీచర్ల పరంగానో.. మొబైల్ ప్రియులను కట్టిపడేసి తమ విలువను పెంచుకుంటున్నాయి.
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘ZTE ఆక్సాన్’ 40 సిరీస్ క్రింద పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ‘ZTE అక్సాన్ 40 అల్ట్రా స్పేస్ ఎడిషన్‘ను లాంచ్ చేసింది. కంపెనీ తాజాగా ఈ ఫోన్‌ను చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీన్ని రెండు వేరియంట్లలో లాంచ్ చేయగా, 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,898 యువాన్లుగా(భారత కరెన్సీలో దాదాపు రూ. 67,200), 18జీబీ ర్యామ్ + 1టిబి స్టోరేజ్ వేరియంట్ ధర 7,698 యువాన్లుగా(భారత కరెన్సీలో దాదాపు రూ. 87,700)గా నిర్ణయించింది. సింగిల్ బ్లాక్ కలర్‌లో దీన్ని తీసుకొచ్చారు.
The aerospace edition of #ZTE Axon 40 ULTRA Launched in china…..
•12GB+512GB:- ¥5898
•18GB+1TB:- ¥7698 pic.twitter.com/BVNIshqmgn— I N E R T E C H (@INERTECH12) November 30, 2022
జెడ్‌టిఈ ఆక్సాన్ 40 అల్ట్రా స్పేస్ ఎడిషన్ లో 6.8 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే అందించారు. ఇది ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ పై పనిచేయనుంది. దీనికి ఇండిపెండెంట్ సెక్యూరిటి చిప్ సపోర్ట్ కూడా అందించారు. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. దీనిలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కాగా, మిగిలిన రెండు కెమెరాలకు 64 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇందులో 8కె రికార్డింగ్ సపోర్టింగ్ కూడా ఉంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 5000mAh బ్యాటరీ అందించారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
Directly from #ZTE the unboxing experience of just announced AXON 40 ULTRA Space Edition, sono good (software is another matter unfortunately… 🫢)#zteaxon40ultra #trailer #unboxing pic.twitter.com/Mv3lT8uoZm
— Fabrizio Degni (@sev7en2507) December 1, 2022