మీరు చైనా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? అందులోనూ షియామి బ్రాండ్ హా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే! కొన్ని షియామి ఫోన్‌లలో పేమెంట్ వ్యవస్ధ లోపాలున్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ (సీపీఆర్) బయటపెట్టింది. ఈ ఫోన్లను వాడే యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచ్చింది. లేదంటే మీ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చని సూచించింది.
షియామి స్మార్ట్‌ఫోన్లలోని పేమెంట్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్టు చెక్ పాయింట్ రీసర్చ్ (సీపీఆర్) పరిశోధకులు కనుగొన్నారు. ఈ లోటుపాట్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ నుంచి పేమెంట్ ప్యాకేజ్‌ల ఫోర్జింగ్, నేరుగా పేమెంట్ సిస్టంను డిజేబుల్ చేయడం వంటి వాటికి అవకాశం కల్పిస్తున్నట్టు గుర్తించారు. చైనాలో పేరొందిన మీడియా టెక్ చిప్స్‌తో కూడిన షియామి ఫోన్లలో ఈ లోటుపాట్లు ఉన్నట్టు కనుగొన్నారు. మొబైల్ యూజర్లు ఎప్పటికప్పుడు ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సీపీఆర్ సూచించింది. ఈ లోపాలను సరిదిద్దేందుకు షియామి కూడా కసరత్తు సాగిస్తోందని తెలిపింది.
దేశంలో డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆన్ లైన్ లో ఆర్థిక లావాదేవీలు చేసే వారి సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఆన్ లైన్ ద్వారా ఉన్న చోట నుంచే చెల్లింపులు చేయగలుగుతున్నాం. బయటకు వెళ్లిన ప్రతిసారీ పర్సులో నగదు ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కార్డు/యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేస్తున్నాం. రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న వ్యాపారులు కూడా వారి దుకాణాల వద్ద క్యూఆర్ స్కానింగ్ ను అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ఇబ్బంది పడకుండా చెల్లింపులు చేసేస్తున్నాం. అయితే డిజిటల్ లావాదేవీలు ఏ విధంగా పెరిగాయో అదేవిధంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఇటువంటి మోసాల బారిన పడకండా సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఇదీ చదవండి: Smartphones: రూ. 15,000లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
ఇదీ చదవండి: 5జీ టెక్నాలజీ రాబోతోంది.. ఈ క్రమంలో 20వేల లోపు లభించే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ మీకోసం..!