వన్ ప్లస్ కంపెనీకి భారత్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఐఫోన్ ని కూడా ఢీకొట్టే స్థాయికి వన్ ప్లస్ సంస్థ ఎదుగుతోంది. ప్రస్తుతం బడ్జెట్ లో కూడా వన్ ప్లస్ ఫోన్లు వస్తున్నాయి. తాజాగా నార్డ్ సీఈ లైట్ అని 5జీ ఫోన్ ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ పై ఇయర్ బడ్స్ ని ఫ్రీగా ఇస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి దగ్గర ఉంటోంది. ఫోన్ అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మాత్రమే. అయితే వాటిలో కూడా 5జీ ఫోన్లు వచ్చాయి. అంటే అందరూ 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేసే వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఒక్క ఫోన్ కొంటే సరిపోదు.. వాటికి మళ్లీ గ్యాడ్జెట్స్ కావాలి. ఉద్యోగం చేసుకునే వారైతే ఓకే.. మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మీకు ఫోన్ కొనడమే ఎక్కవ మళ్లీ ఇయర్ బడ్స్ కొనాలా? అని క్లాస్ పీకుతారు. అయితే మీరు ఈ ఫోన్ గనుక కొనిపించుకుంటే ఆ బాధ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్ కొనుగోలు చేస్తే ‘నార్డ్ బడ్స్ సీఈ’ ఇయర్ బడ్స్ ని ఉచితంగా ఇస్తున్నారు.
వన్ ప్లస్ కంపెనీకి భారత్ లో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐఫోన్ మార్కెట్ నే ప్రభావితం చేసిన హిస్టరీ ఈ కంపెనీకి ఉంది. ఈ ఫోన్ రాకముందు అందరూ ప్రీమియం ఫోన్ అంటే ఐఫోన్ అనేవారు. కానీ, వన్ ప్లస్ వచ్చాక ఐఫోన్ మార్కెట్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఆ తర్వాత ఈ ఫోన్ నుంచి కూడా బడ్జెట్ ఫోన్లు వచ్చాయ. ఇప్పుడు 5జీ నెట్ వర్క్ లో కూడా బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి నార్డ్ సీఈ3 అనే 5జీ ఫోన్ ని సేల్ కి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 11న ఈ ఫోన్ కొన్న వారికి నార్డ్ బడ్స్ సీఈని ఫ్రీగా ఇస్తున్నారు. వీటి ధర రూ.2,299గా ఉంది. ఇది కేవలం పరిమితకాలం ఆఫర్ మాత్రమే. స్టాక్ క్లియర్ అయిపోతే ఆఫర్ వర్తించదని వెల్లడించారు.
ఇంక ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.72 లార్జ్ డిస్ ప్లే, 120 హెట్స్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, ఆక్సిజన్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయర్ స్టీరియో స్పీకర్స్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్, 8జీబీ వరకు ర్యామ్ ఎక్స్ టెన్షన్ కోసం వర్చువల్ ర్యామ్ కూడా అందుబాటులో ఉంది. ఇది పాస్టర్ లైమ్(చిలకపచ్చ), క్రొమాటిక్ గ్రే కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి. దీనిలో అల్ట్రా వాల్యూమ్ మోడ్ అని ఉంటుంది. 200 శాతం వరకు మీరు వాల్యూమ్ ని పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11 మధ్యాహ్నం నుంచి సేల్ కి వస్తోంది. నార్డ్ బడ్స్ మాత్రమే కేవలం కాసేపు మాత్రమే ఫ్రీగా దొరికే ఛాన్స్ ఉంటుంది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ కలిగిన వారు ఈ ఫోన్ పై అదనంగా రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.