ఇప్పడు ప్రతింట్లో వైఫై.. ఉంటోంది . దీంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉప యోగించుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని మొబైల్ డేటా, వైఫైలు మన నిజజీవితంలో ఒక భాగం అయిపోయాయి. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది యూజర్లు లాగిన్ అయితే సమస్యలు వస్తుంటాయి. నెట్ వర్క్ రద్దీ పెరిగి ఇంటర్నెట్ స్లో అయిపోవడం, సడెన్ గా ఆగిపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. వైఫై స్టాఈ.వైఫై స్టాండర్డ్ నే ‘వైఫై 6ఈ’ అంటారు. వైఫై 6ఈ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ విపరీతంగా పెరుగుతుంది. క్షణాల్లో మూవీని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఎంతమంది వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినా కూడా పెద్దగా నెట్‌వర్క్ సమస్యలు రావు. ఇంటర్నెట్ స్పీడ్ తగ్గదు. వైఫై 6ఈ టెక్నాలజీ.. 6జీహెచ్ నెట్‌వర్క్స్‌ను సపోర్ట్ చేసే డివైజ్‌లలోనే ఈ వర్క్ అవుతుంది. ఆయా డివైజ్‌లు వైఫై 6 ప్రోటోకాల్‌కు అనుసంధానంగా పనిచేస్తే… అప్పుడు వైఫై 6ఈ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వొచ్చు. వైఫై 6ఈ టెక్నాలజీ..6 GH నెట్ వర్క్ ను సపోర్టు చేసే డివైజ్ లలో ఈ వర్క్ అవుతుందని, ఎంత మంది నెట్ వర్క్ కు కనెక్ట్ అయినా ఎలాంటి సమస్యలు రావంటున్నారు. వైఫై 6ఈలో బ్యాండ్ 6జీహెచ్ జెడ్ ఉంటుందని, దీనినే స్పెక్ట్రమ్ అంటారు.
వైఫై 6 టెక్నాలజీతో 6జీహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ తో వచ్చేదే ఈ వైఫై 6ఈ స్టాండర్డ్. వైఫై 6ఈ నెట్ వర్క్ ను తీసుకోవాలంటే 6ఈ ఫీచర్ ను సపోర్టు చేసే రూటర్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాండ్ సర్వీసులు అందించే పలు నెట్ వర్క్స్ జియో ఫైబర్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, యాక్ట్ ఇదే టెక్నాలజీని వాడుతున్నాయి.