వైఫై అనేది ఇప్పుడు దాదాపుగా అందరి ఇళ్లల్లో ఉంటోంది. అయితే అందరూ వైఫైని వాడుతుంటారు.. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకునే విషయంలో మాత్రం అశ్రద్ధగా ఉంటారు. ముఖ్యంగా బయటకు, ఊర్లకు వెళ్లే సమయంలో వైఫై పవర్ సప్లై ఆపకుండా వెళ్లిపోతుంటారు.
ప్రస్తుతం ఇంటర్నెట్ కు మనిషి జీవితంలో ప్రాధాన్యం పెరిగిపోయింది. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంటర్నెట్ లేకపోతే మనిషి జీవితమే లేదని పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మారుతున్న జీవనశైలి, కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీని చూస్తే అదే అనిపిస్తుంటుంది. పట్టణాలు, నగరాలు, మెట్రో సిటీలలో ఇంట్లో వైఫై ఉండటం సహజంగా మారిపోయింది. ఇంట్లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ గ్యాడ్జెట్ల కోసం వైఫైని వాడుతున్నారు. అయితే చాలామంది ఈ వైఫై విషయంలో ఒక తప్పు చేస్తుంటారు. బయటకు వెళ్లే సమయంలో వైఫై పవర్ ఆఫ్ చేయరు. అలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం.
సిటీల్లో వైఫై అనేది ఇప్పుడు దాదాపుగా అన్ని ఇళ్లల్లో ఉంటోంది. ఇంటెర్నెట్ కోసం మొబైల్ డేటా కంటే అందరూ వైఫై పెట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్మార్ట్ టీవీలు, ఓటీటీ యాప్స్ కారణంగా అందరి ఇళ్లల్లో వైఫై ఉంటోంది. అయితే ఈ వైఫైని అందరూ వాడతారు కానీ, దానిని ఎలా వాడాలో చాలా మందికి తెలియకపోవచ్చు. వైఫైకి సెక్యూర్డ్ పాస్ వర్డ్ పెట్టుకోవడం, మన వైఫై నెట్ వర్క్ మరెవరన్నా వాడుతున్నారేమో చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోరు. మరీ ముఖ్యంగా బయటకి, ఊర్లకు వెళ్లే సమయంలో వైఫై పవర్ సప్లై ఆఫ్ చేయరు. అంటే వైఫై స్విచ్ ఆఫ్ చేయకుండానే అలాగే వదిలి వెళ్లిపోతారు.
అలా చేయడం వల్ల భారీ, అతి భారీ నష్టాలు కాకపోయినా కూడా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. మీరు వైఫై నెట్ వర్క్ ని స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్లడం కారణంగా.. మీ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. అంటే ఈ మధ్య వచ్చిన కొత్త టెక్నాలజీతో మీ వైఫై పాస్ వర్డ్ క్రాక్ చేయడం పెద్ద సమస్య కాదు.. అలా మీరు వైఫై స్విచ్ ఆఫ్ చేయకపోతే మీ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. అలాగే మీ వైఫై నెట్ వర్క్ ద్వారా ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తే.. నెట్ వర్క్ అడ్రస్ ఆధారంగా మీరే బాధ్యులు అవుతారు. వేరే వాళ్లు మీ డేటాని వాడుకోవడం వల్ల మీ మంథ్లీ ప్లాన్ లో ఉండే డేటా త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు ఊరికి వెళ్లే సందర్భంలో కచ్చితంగా వైఫై ఆపేయండి. అలా చేయడం వల్ల మీకు విద్యుత్ ఛార్జెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఒక్క యూనిట్ విద్యుత్ తో శ్లాబు మారిపోయి వందల్లో బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది.