నేటి రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేనివాళ్లైనా ఉన్నారేమో గానీ, గూగుల్ అకౌంట్ లేనివారు ఉండరు అనడం అతిశయోక్తి మాత్రం కాదు. నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో గూగుల్ అకౌంట్ షరామామూలు అయిపోయింది. మరి, ఒక యూజర్ చనిపోతే అతని అకౌంట్ ఏమవుతుంది. అతని డేటా మొత్తం ఏం చేస్తారు? ఎవరు మళ్లీ అది చూసే వీలుంటుంది అనే ప్రశ్నలు కచ్చితంగా వస్తుంటాయి. వాటికి సమాధానాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి. ఒక అవసరం కోసం గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ అవసరం తీరిపోయినా.. మరో ఖాతా తెరిచినా.. లేదా సదరు యూజర్ చనిపోయినా ఆ అకౌంట్ నిరుపయోగంగా మారిపోతుంది. అలాంటప్పుడు గూగుల్ రెండు ఆప్షన్స్ ఇస్తుంది.
ఇదీ చదవండి: 15 మంది ఇష్టమొచ్చినట్లు కొట్టారు.. తనపై దాడి చేసింది ఎవరో బయటపెట్టిన సుఖీభవ శరత్
మీ అకౌంట్‌ని ఎంతకాలం ఇనాక్టివ్ చేయాలో గూగుల్‌కు తెలపాలి. అందుకు మీకు గరిష్టంగా 18 నెలల సమయం ఉంటుంది. ఆ తర్వాత అకౌంట్ ఇనాక్టివ్ అయిపోతుంది. ఇనాక్టివ్ అయ్యాక మీ డేటా యాక్సెస్ ఎవరికి ఇవ్వాలో తెలపాలి. అందుకు గరిష్టంగా 10 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వారి మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు కూడా తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి డేటా షేర్ చేయాలి అనే ఆప్షన్ ఉంటుంది. గూగుల్ ఫొటోస్, లొకేషన్ యాక్సెస్, చాట్ వంటి పోపప్ ఒకటి వస్తుంది. అందులో ఉండే ఆప్షన్స్ ఎంచుకోవాలి. అలా ఎంపిక చేసిన వారికి అకౌంట్ ఇనాక్టివ్ అవ్వగానే మెయిల్ ద్వారా సమాచారం చేరవేయబడుతుంది. మీరు ఎంపిక చేసిన వ్యక్తికి ఆ సమాచారం చూసేందుకు 3 నెలల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఒకవేళ వారి వివరాలను ఎవరితో పంచుకోవడం ఇష్టం లేకపోతే ఎవరి మెయిల్‌ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారికోసం డిలీట్ మై డేటా పర్మినెంట్లీ అనే ఆప్షన్ కూడా ఉంది. అది సెలక్ట్ చేసుకుంటే వారి డేటా అకౌంట్ ఇనాక్టివ్ అయిన సరిగ్గా 3 నెలల తర్వాత శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఇక ఆ అకౌంట్ యాక్సెస్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.