కస్టమర్ల శ్రేయస్సు కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ మరింత ఆకర్షణీయంగా మారుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ టాప్ లో నిలుస్తోంది. డేటా సెక్యూరిటీ ఫీచర్స్ తక్కువుగా ఉన్న పలు మొబైల్స్ కు ఇప్పటికే తమ సేవలను నిలిపివేసిన వాట్సాప్.. ఆ జాబితాలోకి మరిన్ని మోడల్స్ చేర్చనున్నట్లు ప్రకటించింది. త్వరలో కొన్ని పాత ఐఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్‌వేర్‌లపై పనిచేయనున్న పాత ఐఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాల్సిందే అన్నమాట.
డబ్ల్యూఏబీటాఇన్ఫో కథనం ప్రకారం.. రానున్న నెలల్లో ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 అప్‌డేట్లకు వాట్సాప్ సపోర్ట్ అందించడం నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. 2022 అక్టోబర్ 24వ తేదీ నుంచి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయనున్నట్లు ఈ స్క్రీన్ షాట్‌లో పేర్కొన్నారు. వినియోగదారులు తమ ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకోక తప్పదన్న మాట. అయితే ప్రస్తుతం ఐవోఎస్ 10, 11ల మీద పనిచేసే ఫోన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తున్నాయి. ఐవోఎస్ 12 వర్షన్ వీటికి అందించడం లేదు. ఈ ఫోన్లు ఉపయోగించేవారు అక్టోబర్ నుంచి వాట్సాప్‌ను ఉపయోగించడం కుదరకపోవచ్చు. ఐఫోన్ 5ఎస్, దాని పై వెర్షన్లకు మాత్రమే ఐవోఎస్ 12 సపోర్ట్ లభించనుంది.
“ఐవోఎస్ 12 లేదా దానికంటే పైవెర్షన్లకు మాత్రమే వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోమని మేం సిఫారసు చేస్తున్నాం. నిరంతరాయంగా వాట్సాప్‌ను ఉపయోగించేందుకు ఐఫోన్‌ను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి” అని వాట్సాప్ మాతృ సంస్థ పేర్కొంది.
Meta-owned, WhatsApp is now dropping support for iOS 10 and iOS 11 and has made iOS 12 the minimum software requirement for iPhone users.
For more: https://t.co/EV5DOYuI33#whatsapp #ios #support pic.twitter.com/82HJYK2xS0— Technologistan (@technologistpk) May 23, 2022
ఈ సంవత్సరం ఐవోఎస్ 16, మ్యాక్ వోఎస్ 13 వెర్షన్‌లను వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో యాపిల్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 డివైజ్‌లకు సపోర్ట్ నిలిపివేయాలని వాట్సాప్ భావిస్తోంది. మరోవైపు ఇప్పటికీ ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న మొబైళ్లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా వాట్సాప్ సూచిస్తోంది. ఒకవేళ అప్‌డేట్‌కు సపోర్ట్ చేయని ఫోన్‌లో వాట్సాప్ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయి.
ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్! ఒకే అకౌంట్.. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో..