ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు రెండు కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. చాటింగ్, ఆడియో-వీడియో కాలింగ్ సదుపాయం, గ్రూప్ చాట్, ఏవేని ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ పంపుకునే అవకాశం, మనీ ట్రాన్సక్షన్స్, స్టేటస్ రూపంలో మన వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం.. ఇలా బోలెడు ప్రయోజనాలు వాట్సాప్ వల్ల కలుగుతున్నాయి. అందువల్లే వాట్సాప్ కు ఇంత ఆదరణ. అయితే, కొందరు యూజర్లు వాట్సాప్ నిబంధనలకు అతిక్రమించినట్లు తెలుస్తోంది. అలాంటి వారిపై కొరడా ఝుళిపించింది.
డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నెలరోజుల్లో దేశంలో 36,77,000 వాట్పాప్ ఖాతాలను నిషేధిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటన చేసింది. కొత్త ఐటీ రూల్స్ 2021ను అనుగుణంగా వినియోగదారులపై వాట్సాప్ ఈ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000 వాట్సాప్ వినియోగదారుల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ పరిశ్రమలోనే అగ్రగామిగా ఉందని వాట్సాప్ పేర్కొంది. అలాగే, కొన్ని ఖాతాలకు సంబంధించి 1607 మంది వినియోగదారుల నుంచి అప్పీళ్లు వచ్చాయని తెలిపింది. నెలవారీ నివేదికలో భాగంగా 2021 ఐటీ రూల్స్ ప్రకారం ఆ ఖాతాలను తొలగించామని వాట్సప్ స్పష్టం చేసింది.
#WhatsApp Banned Over 3.6 Million Accounts in India in December 2022 pic.twitter.com/a29XDTssSd
— eBuzzPro (@ebuzzprocom) February 2, 2023