సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ వాడే అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు కూడా తమ కార్యకలాపాల కోసం వాట్సాప్ నే వాడుతున్నాయి. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పుడూ అప్ డేట్స్ తీసుకొస్తూనే ఉంటుంది.
వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ తో యూజర్లను అబ్బుర పరుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ తీసుకొస్తూ అలరిస్తోంది. ప్రతినెల ఒక అప్ డేట్ ఉండేలా వాట్సాప్ ప్రయత్నిస్తుంటుంది. ఆండ్రాయిడ్- ఐవోఎస్ యూజర్ల కోసం విడివిడిగా అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఇచ్చిన విధంగా ఐవోఎస్ యూజర్ల కోసం ఫీచర్స్ తీసుకురారు అంటూ వాట్సాప్ పై అపవాదులు కూడా ఉన్నాయి. కానీ, గత కొన్ని నెలలుగా ఐవోఎస్ యూజర్ల కోసమే ఎక్కువ అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా కూడా యాపిల్ ఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ ఫీచర్స్ తీసుకొచ్చింది.
ఐవోఎస్ యూజర్ల కోసం వాట్సాప్ తాజాగా ఒక ఫీచర్ ని తీసుకొచ్చింది. టెలిగ్రామ్ యూజర్లకు ఈ ఫీచర్ బాగా తెలిసి ఉంటుంది. అదేంటంటే.. వీడియో మెసేజ్ పంపడం. అంటే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని రికార్డ్ చేసి ఒక వీడియో సందేశం లాగా పంపవచ్చు. 60 సెకన్ల నిడివితో వీడియో మెసేజ్ పంపేలా ఫీచర్ తీసుకురానున్నట్లు వాట్సాప్ ఇప్పటికే హింట్ ఇచ్చింది. దీనిలో కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది. అంటే మీ సందేశాలకు భద్రత ఉంటుంది. అయితే ఇది ఐవోఎస్ యూజర్ల కోసం మాత్రమే. ఏ ఫీచర్ ని అయినా దాదాపు ఇద్దరు యూజర్ల కోసం తీసుకొస్తారు. కాకపోతే ఆండ్రాయిడ్- ఐవోఎస్ యూజర్ల కోసం ఫీచర్ అందుబాటులోకి తీసుకురావాలంటే కాస్త సమయం పడుతుంది.
ఇటీవల వాట్సాప్ నుంచి కొన్ని అదిరిపోయే ఫీచర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అవేంటంటే.. ఒకేసారి 4 డివైజ్ లలో వాట్సాప్ ని కనెక్ట్ చేసేలా ఆప్షన్ తీసుకొస్తున్నారు. అలాగే వెబ్ వాట్సాప్ నుంచి ఆడియో- వీడియో కాల్స్ మాట్లాడే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటిచారు. అలాగే మెటా నుంచి తమ సొంత ఏఐ బాట్ ని అందుబాటులోకి తీసుకొస్తామని జుకర్ బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు కొన్ని ఏపీకే ఫైల్స్ ద్వారా వాట్సాప్ లో చాట్ జీపీటీని వాడుతున్నారు. మెటా సొంత ఏఐ వస్తే.. వాట్సాప్ లో చాట్ జీపీటీ తరహా చాట్ బాట్ ని ఎంచక్కా వాడుకోవచ్చు.