ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. ఈ మేసేజింగ్ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా భద్రత, ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. ఇటీవల భద్రతా ఫీచర్స్ అప్ డేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరికొన్ని ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి అంటూ చెబుతున్నారు.
సోషల్ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యాప్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత అవసరాలు అయిన మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ మాత్రమే కాకుండా.. ఆఫీస్, బిజినెస్ పర్పస్ కోసం గ్రూప్ చాట్, మీటింగ్స్ వంటి వాటికి కూడా వాట్సాప్ ని వాడుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో వాట్సాప్ ఎంతో ఆదరణ పొందింది. అందుకు ప్రధాన కారణం యూజర్ ఫ్రెండ్లీ, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకురావడం. తాజాగా వాట్సాప్ కొన్ని అప్డేట్స్ తీసుకొస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాట్సాప్ లో స్టేటస్ చూసేందుకు, వీడియోలు డౌన్లోడ్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని త్వరలోనే పరిక్ష్కరిస్తామంటూ వాట్సాప్ తెలిపింది. ఇంక కొత్త ఫీచర్స్ ఏంటంటే.. ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యూమెంట్లు ఫార్వార్డ్ చేసే సమయంలో మీరు దానికి ఒక వివరణ జోడించేందుకు ఇప్పటికే అవకాశం ఉంది. దానికి అదనంగా ఇప్పుడు మీరు ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యూమెంట్లు ఫార్వార్డ్ చేసే సమయంలో వాటికి ఉండే డిస్క్రిప్షన్, క్యాప్షన్ మీరు తొలగించవచ్చు. దాని స్థానంలో మీరు సొంతంగా డిస్క్రిప్షన్ ని జోడించేందుకు వీలు కలిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు పంపే వాటికి సంబంధించిన వివరాలను స్పష్టంగా చెప్పే వీలుటుంది. పైగా ఇది ఫార్వార్డ్ మెసేజ్ అనే విషయం కూడా తెలుస్తుంది. వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ కి అప్ డేట్ చేసుకున్న డెవలపర్లకు టెస్టింగ్ కోసం ఈ ఫీచర్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే వీటిని ఎప్పుడు యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారు అనే విషయంపై అధికారిక ప్రకటన లేదు. ఇటీవలే వాట్సాప్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ భద్రతను మరింత పెంచేలా 3 ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పాత డివైజ్ నుంచి కొత్త ఫోన్లోకి వాట్సాప్ ని లాగిన్ చేయాలి అంటే.. పాత్ ఫోన్ నుంచి పర్మిషన్ ఇవ్వాలి. ఈ ఫీచర్ వల్ల అకౌంట్ క్లోన్, ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉండవు. ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ని కూడా మీరు చెక్ చేయవచ్చు. మీరు మెసేజ్ చేసే కాంటాక్ట్ ప్రొటెక్టెడ్ అవునో కాదో చూసుకోవచ్చు. ఇంక మాల్ వేర్ వంటి ప్రమాదకర బగ్స్ నుంచి మీ డివైజ్ ని ప్రొటెక్టెడ్ గా ఉంచుతారు. అందుకు వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తుంటుంది.