ప్రపంచంలో ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్. నిత్యం కోట్లాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ఇతరులతో చాట్ చేస్తుంటారు. ఒక్క చాట్ మాత్రమే కాదు.. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో యూజర్లు వాట్సాప్ బాగా అట్ట్రాక్ట్ అయ్యారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క మొబైల్ లో ఈ యాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే యూజర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
‘వాయిస్ నోట్స్‌ను.. వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్’గా పెట్టుకునే వెసులుబాటును కల్పించడంపై వాట్సాప్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చని వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే వాబీటాఇన్ఫో పేర్కొంది. స్టేటస్‌ల్లో వాయిస్ నోట్ సపోర్ట్ పనిచేసే తీరును వివరించే ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా వాబీటాఇన్ఫో షేర్ చేసింది. స్టేటస్ ట్యాబ్ దిగువన ఉండే న్యూ ఐకాన్ ద్వారా యూజర్లు వాయిస్ నోట్‌ను సత్వరమే స్టేటస్ అప్‌డేట్‌కు పంపవచ్చని పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్‌గా ఇమేజ్‌లు, వీడియోలను పోస్ట్ చేసేందుకు యూజర్లకు వెసులుబాటు ఉంది. ఈ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
WhatsApp is working on voice notes for status updates pic.twitter.com/RLrxO7uKJW
— Govardhan Reddy (@gova3555) July 13, 2022
ఇదీ చదవండి: WhatsApp: డబుల్ ధమాకా.. ఒకే ఫోన్ నెంబర్ తో రెండు వేరు వేరు మొబైల్స్ లో వాట్సాప్!
ఇదీ చదవండి: OnePlus: మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. సగం ధరకే OnePlus స్మార్ట్‌ఫోన్