వాట్సాప్ గురించి తెలియని స్మార్ట ఫోన్ యూజర్ ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ అంత ఫేమస్ మరి. అయితే తమ యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పుడూ సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది.
వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ కి మంచి ఆదరణ ఉంది. ఇలాంటి ఎన్నో యాప్స్ నుంచి యునిక్ గా ఉండేందుకు, యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం విడివిడిగా అప్ డేట్స్ ఇస్తుటారు. తాజాగా వాట్సాప్ మరిన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయని చెప్పాలి. డివైజ్ లింకింగ్ ప్రాసెస్ ని సులభతరం చేసింది. అలాగే మీరు వాట్సాప్ ని ఒకేసారి 4 డివైజ్ లలో లాగిన్ చేసి ఉంచుకోవచ్చు.
వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్స్ ని విడుదల చేసింది. మీరు మీ వాట్సాప్ ని నాలుగు డివైజ్ ల వరకు లింక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఆఫ్ లైన్ లో ఉన్నా కూడా.. మీ చాట్స్ అన్నింటిని యాక్సెస్ చేసుకోవచ్చు. మీ విండోస్ డెస్క్ టాప్ లో వాట్సాప్ ని అప్ డేట్ చేసిన తర్వాత మీకు ఈ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి. వీడియో కాల్, ఆడియో కాల్, డివైజ్ లింకింగ్ ఆప్షన్స్ ని మీరు చూడగలరు. తాజా ఫీచర్స్ గురించి వాట్సాప్ ఒక ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసింది. “నో ఛార్జర్- నో ప్రాబ్లమ్.. ఇప్పుడు మీ వాట్సాప్ ని నాలుగు డివైజ్ లకు లింక్ చేసుకోవచ్చు. మీ చాట్స్ సింక్రనైజ్ అయి ఉంటాయి.” అంటూ చెప్పుకొచ్చింది.
👨💻 We’re excited to introduce a brand 🆕 faster WhatsApp app for Windows desktop, that now includes group video and audio calls.
Stay synced and encrypted regardless of what device you’re using.
Download here: https://t.co/RtDkjmZCqk
— WhatsApp (@WhatsApp) March 23, 2023
మీరు మీ వాట్సాప్ ని పలు డివైజ్ లలో లాగిన్ చేయాలి అనుకుంటే ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. మీ ప్రైమరీ డివైజ్ లో వాట్సాప్ ని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి లింక్డ్ డివైజెస్ క్లిక్ చేయండి. లింక్ న్యూ డివైజ్ పై క్లిక్ చేయండి. ఆన్ స్క్రీన్ ఇన్ స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. రెండో డివైజ్ ని కనెక్ట్ చేసేందుకు వెబ్ వాట్సాప్ లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లింక్ చేసుకోండి. కాసేపటికి మీ చాట్స్ అన్ని ఆ డివైజ్ లో సింక్రనైజ్ అవుతాయి. మీరు అలాగే మిగిలిన డివైజెస్ లో కూడా మీ వాట్సాప్ ని లాగిన్ చేసుకోవచ్చు. అలా మొత్తం 4 డివైజ్ లలో మీ వాట్సాప్ ని లాగిన్ చేయచ్చు. మీ మొబైల్ నుంచి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వాట్సాప్ ని లాగౌట్ కూడా చేసుకోవచ్చు.
No charger, no problem. Now you can link WhatsApp to up to 4 devices so your chats stay synced, encrypted, and flowing even after your phone goes offline 🖥️ 📲
— WhatsApp (@WhatsApp) March 23, 2023