ప్రపంచవ్యాప్తంగా చాలా సోషల్ మెసేజింగ్ యాప్స్ ఉన్నాయి. వాటిలో వాట్సాప్ కి మాత్రం చాలా మంది ఆదరణ ఉంది. అందుకే యూజర్ల కోసం ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్ డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్- ఐవోఎస్ యూజర్లకు వాట్సాప్ నుంచి తరచుగా అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి.
వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ కి ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఒక్క మెసేజింగ్ కోసమే కాకుండా.. వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కి కూడా బాగా వాడుతున్నారు. ఈ వాట్సాప్ లో ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ కూడా ఉంటుంది. అంటే మీ సమాచారం వాట్సాప్ ద్వారా గోప్యంగా ఉంటుందని అర్థం అనమాట. వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఇలా అందరు యూజర్ల కోసం ప్రతినెలా దాదాపు ఒక అప్ డేట్ అయినా తీసుకొస్తుంది. తాజాగా ఐవోఎస్ యూజర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్ తో వాట్సాప్ రాబోతోంది.
వాట్సాప్ సాధారణంగా ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఎక్కువగా అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది అంటుంటారు. కానీ, గత కొంతకాలంగా ఐవోఎస్ యూజర్ల కోసమే అప్ డేట్స్ తీసుకొస్తోంది. తాజాగా తెచ్చిన ఫీచర్ ఐవోఎస్ యూజర్ల కోసం తెచ్చినా కూడా వారిని పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు తెచ్చిన ఫీచర్ ఇప్పటికే యాపిల్ ఐవోఎస్ 16లో ఉంది. ఇమేజెస్, వీడియోస్ నుంచి టెక్ట్స్ ని కాపీ చేయడం. దీనిని లైవ్ టెక్ట్స్ అంటారు. అంటే మీకు వచ్చిన ఇమేజ్, వీడియో నుంచి మీరు కావాలనుకుంటే ఆ టెక్ట్స్ ని కాపీ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, కావాలంటే షేర్ కూడా చేయచ్చు.
ఇప్పుడు ఐవోఎస్ 16ఏపీఐని వాడుకుని వాట్సాప్ అలాంటి ఒక ఫీచర్ ని తీసుకొచ్చింది. మీరు ఈ ఫీచర్ తో టెక్ట్స్ కాపీ చెయ్యడమే కాదు.. కావాలనుకుంటే దానిని ట్రాన్స్ లేట్ కూడా చేయచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరు యూజర్లకు అందుబాటులో ఉంచారు. ఐవోఎస్ 16లో ఉన్న ఫీచర్ ని ఐవోఎస్ యూజర్లకు ఇవ్వడం వల్ల ఏం లాభం ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ ఈ ఫీచర్ ని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తే బావుంటుందని చెబుతున్నారు. ఈ ఫీచర్ ఐవోఎస్ 16 ద్వారా యాపిల్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ ఫీచర్ ని ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.