ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో వాడే యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్ అనడంలో సందేహం లేదు. ఇటీవల వాట్సాప్ ప్రొఫైల్ పై ఫేస్ బుక్ మాదిరిగా కవర్ పిక్చర్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.
బెటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. వినియోగదారుల కోసం ప్రొఫైల్ కోసం కవర్ పిక్చర్ ఫీచర్ పై పనిచేస్తుంది వాట్సాప్. ప్రొఫైల్ లో కవర్ ఫోటోలను సెట్ చేసేందుకు అనుమతించే కొత్త ఫీచర్ ఇటీవల గుర్తించబడింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బిజినెస్ ఖాతాలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ ఫీచర్ వాట్సాప్ లోని జాబితాను మెరుగుపరుస్తుంది. ఇది మాములు వాట్సాప్ ఖాతాలకు సాధ్యం కాదు. బీటా టెస్టర్ ల కోసం ఈ కవర్ ఫోటో ఫీచర్ తీసుకురానున్నట్లు సమాచారం.మీ బిజినెస్ వాట్సాప్ సెట్టింగ్ లలో కొత్త కెమెరా బటన్‌ను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇక్కడే మీరు కవర్ ఫోటో సెట్ చేయడం లేదా ఉన్న ఫోటోని మార్చడం లాంటివి చేయవచ్చు. మీ వాట్సాప్ కవర్ ఫోటోని మీ కాంటాక్ట్స్ లిస్టులో ఉన్నవారు చూడగలరు. వాట్సాప్ పర్సనల్ కాల్ కోసం.. కాలర్ ఇంటర్ ఫేస్ ను పునరుద్ధరించడంతో పాటు త్వరలో గ్రూప్ కాల్స్ కోసం పూర్తిగా కొత్త డిజైన్ ను వాట్సాప్ తీసుకురాబోతుంది. మీరు గ్రూప్ వాయిస్ కాల్ చేసినప్పుడు, కాల్ సమయంలో పాల్గొనే వారందరికీ వాయిస్ వేవ్ ఫామ్ లను తీసుకురావాలని స్క్రీన్ షాట్ కనిపిస్తాయి.
ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వస్తోందని కంపెనీ నివేదించింది. ప్రస్తుతానికి iOS, బీటా యాప్‌లో కొత్త ఇంటర్ ఫేస్ ఆప్షన్ లేదు. అయితే ఫీచర్స్ ట్రాకర్ అనేది ఫ్యూచర్ లో అందుబాటులోకి రావచ్చని అంటున్నారు. మరి.. వాట్సాప్ కొత్త ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.