వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకంటే దాదాపుగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ వాట్సాప్ ని వాడుతుంటారు. వారికున్న క్రేజ్ ని నిలబెట్టుకోవడానికి వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ నుంచి రాబోతున్న ఫీచర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
వాట్సాప్.. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు. మెసేజ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మీటింగ్ అంటూ ప్రతి అవసరానికి ఈ మెసేజింగ్ యాప్ నే వాడుతుంటారు. వాట్సాప్ కి అంత క్రేజ్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం. రెండు వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇవ్వడం, ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకురావడం చేస్తుంటుంది. ఆండ్రాయిడ్, ఓవోఎస్ యూజర్లకు ప్రత్యేకంగా ఫీచర్స్ ని తీసుకొస్తుంటుంది. ఇప్పుడు వాట్సాప్ ఫీచర్ కి సంబంధించిన కొన్ని లీకులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఆ ఫీచర్ ఏంటి? ఎందుకు నెట్టింట అంత చర్చ జరుగుతోందో చూద్దాం.
వాట్సాప్ నుంచి నెలకు ఒక అప్ డేట్, ఫీచర్ అయినా అందుబాటులోకి వస్తుంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ని అందూబాటులోకి తీసుకొన్ని వాట్సాప్.. మరిన్ని ఫీచర్స్ పై పనిచేస్తోంది. ఇప్పుడు వాట్సాప్ నుంచి వినిపిస్తున్న ఫీచర్ ఏంటంటే.. మీ చాట్ ని లాక్ చేసుకోవడం. వాట్సాప్ కి లాక్ ఉంటుంది కదా? మళ్లీ ఈ చాట్ లాక్ దేనికి అనుకుంటున్నారా? అయితే కొన్నిసార్లు మీ ఫోన్ ని ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇస్తుంటారు. వాట్సాప్ ఓపెన్ చేసి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మీ పర్సనల్ చాట్స్ ఏమైనా వాళ్లు చూస్తారేమో అనే భయం కచ్చితంగా ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఈ ఫీచర్ సాయంతో మీకు కావాల్సిన చాట్ ని లాక్ చేసుకుంటే దానిని ఓపెన్ చేయాలి అంటే పాస్ కోడ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ లాంటివి అవసరం.
ఇలా మీ చాట్స్ ని లాక్ చేసుకుంటే మీరు నిశ్చింతగా వాట్సాప్ అన్ లాక్ చేసైనా మీ ఫోన్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఆర్కైవ్డ్ చాట్స్ లాగానే.. ఈ లాక్ చేసిన చాట్స్ సెపరేట్ సెక్షన్ కి మూవ్ అవుతాయి. ఇందుకోసం మీ వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ లో చాట్ లాక్ ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, అంతకంటే ముందు ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ ఫీచర్ ని వాట్సాప్ ఇంకా విడుదల చేయలేదు. ఇది డెవల్మెంట్ స్టేజ్ లో ఉన్నట్లు ప్రముఖ వెబ్ సైట్ WABetainfo వెల్లడించింది. ఇది బేటా వర్షన్ లో కూడా అందుబాటులో లేదు. కానీ, అతి త్వరలో ఇది టెస్టింగ్ కోసం ఆండ్రాయిడ్ బేటా, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తీసుకురాబోతున్న చాట్ లాక్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.