ప్రపంచవ్యాప్తంగా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దాదాపుగా స్మార్ట్ ఫోన్ వాడే అందరూ వాట్సాప్ ని వాడుతుంటారు. మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ మీటింగ్స్ కోసం ఈ యాప్ ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే వాట్సాప్ యూజర్లు కొంతకాలంగా ఓ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాట్సాప్ యూజర్లు అయితే కొన్నాళ్లుగా అన్ వాంటెడ్, స్పామ్, ఇంటర్నేషనల్ కాల్స్ తో విసిగి వేసారిపోతున్నారు. అవి కొన్ని ఎల్లో పేజెస్ కాల్స్ అయితే.. మరికొన్ని మాత్రం స్కామర్ల కాల్స్ అవుతున్నాయి. అలాంటి కాల్స్ రావడం వల్ల విసుగురావడమే కాకుండా.. తెలియని వాళ్లు అయితే డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఫ్రాడ్ కాల్స్, స్పామ్ కాల్స్ విషయంలో వాట్సాప్ చర్యలకు ఉపక్రమించింది. అలాంటి కాల్స్ ని కట్టడి చేయడమే కాకుండా.. యూజర్ సేఫ్టీ విషయంలో వాట్సాప్ సంస్థ జాగ్రత్తలు తీసుకోనుంది.
వాట్సాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. పైగా వాట్సాప్ లో ఇంకా ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అందుకే అందరూ వాట్సాప్ నే ఎక్కువగా వాడుతున్నాయి. అయితే ఇలాంటి స్కామ్ కాల్స్, స్పామ్ కాల్స్, మెసేజెస్ యూజర్లను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రోజుకు దాదాపు 17 స్పామ్ కాల్స్ వస్తున్నట్లు యూజర్లు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ సమస్య మరింత జటిలం కాకముందే చర్యలకు ఉపక్రమించారు. వాట్సాప్ సంస్థ ట్రూకాలర్ తో కలిసి పని చేస్తోంది. అందుకు తమ ఏఐ- ఎంఎల్ సిస్టమ్స్ ని అప్ గ్రేడ్ చేస్తున్నట్లు స్వంయగా వాట్సాప్ వెల్లడించింది.
ప్రస్తుతానికి వాట్సాప్ లో మీకు బ్లాక్ అండ్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీకు తెలియని నంబర్, ఇంటర్నేషనల్ నంబర్ నుంచి మీకు ఫోన్ వస్తే మీరు ఆ నంబర్ ని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయచ్చు. అలా చేస్తే మీకు మళ్లీ ఆ నంబర్ నుంచి ఫోన్ రాదు. అంతేకాకుండా వాట్సాప్ అల్గారిథమ్ ఆ నంబర్ పై బ్యాగ్రౌండ్ వర్క్ చేస్తుంది. అది స్పామ్ అని తేలితే ఆ అకౌంట్ ని రిమూవ్ చేస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్ తీసుకురాబోయే అప్ గ్రేడ్ విషయంలో యూజర్ చేయాల్సింది ఏమీ లేదు. ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో వాట్సాప్ సంస్థ ఏఐ- ఎంఎల్ సిస్టమ్స్ ని అప్ గ్రేడ్ చేస్తుంది. తర్వాత మీకు సాధ్యమైనంత వరకు స్పామ్, స్కామ్ కాల్స్, ఫ్రాడ్ మెసేజెస్ రావని చెబుతున్నారు.