ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాట్సాప్ ఆకట్టుకుంటుంది. తాజాగా మరో ఆరు ఫీచర్లను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువు అయిపోయింది. వాట్సాప్ లేకపోతే పనులు జరగడం లేదు. ఎన్నో కంపెనీలు వాట్సాప్ నే నమ్ముకుని పని చేస్తున్నాయి. ఇక సాధారణ వినియోగదారులు కూడా వాట్సాప్ నే జీవితంగా భావించి వాడుతున్నారు. వాట్సాప్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ వాట్సాప్ తోనే సగానికి పైగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాట్సాప్ తోనే సంసారం చేస్తున్నారు. మరి ఆ సంసారంలో తప్పులు దొర్లకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ ఉండాలి. వాట్సాప్ సంస్థ చేసేది అదే. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ తీసుకొస్తుంటుంది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు.. వారి భద్రతకు తగ్గట్టు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. తాజాగా 6 బీటా ఫీచర్లను సిద్ధం చేసింది.
వాట్సాప్ లో అటాచ్మెంట్ సెక్షన్ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సెక్షన్ విషయమై ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే కొత్త వెర్షన్ v2.23.6.17లో అటాచ్మెంట్ పాపప్ స్టైల్ ను పూర్తిగా మార్చేస్తున్నారు. మొబైల్ నోటిఫికేషన్ ప్యానల్ తరహాలో ఐకాన్స్ లా ఉండబోతోంది.
వాట్సాప్ లో ఒక వ్యక్తి పేరు వెతికితే.. ఆ వ్యక్తి ఏ ఏ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారో తెలిస్తే బాగుంటుందని అనిపించిందా? అయితే వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్ ను డెవలప్ చేసింది. బీటా వెర్షన్ వాట్సాప్ లో ఈ మేరకు అప్డేట్ చేశారు. గ్రూప్స్ ఇన్ కామన్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ముక్కూ, ముఖం తెలియని వ్యక్తులు కూడా వాట్సాప్ గ్రూపులో జాయినైపోతారు. గ్రూప్ ఇన్వైట్ లింక్ ని క్లిక్ చేసి గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు. అయితే ఇకపై ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే గ్రూపులో చేరాలంటే ఖచ్చితంగా అడ్మిన్ అప్రూవ్ చేయాల్సిందే. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్తే అక్కడ పెండింగ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ కాంటాక్ట్ లు కనబడతాయి. అడ్మిన్ ఆ కొత్త రిక్వస్ట్ లను యాక్సెప్ట్ చేస్తేనే గ్రూప్ లో చేరే అవకాశం ఉంటుంది. దీంతో ఎవరు పడితే వారు గ్రూప్ లోకి సభ్యులను ఇన్వైట్ లింక్ ద్వారా యాడ్ చేయడం కుదరదు. ఇన్వైట్ చేయగలరేమో గానీ అడ్మిన్ ఆ కొత్త గ్రూప్ మెంబర్స్ ని అంగీకరిస్తేనే గ్రూప్ లో సభ్యులయ్యే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ గ్రూప్ లో ఇతరుల చాటింగ్ దగ్గర ఆ వ్యక్తి పేరు వస్తుంది. అయితే ఆ వ్యక్తి నంబర్ మన మొబైల్ నంబర్ లో లేకపోతే నంబర్ మాత్రమే వస్తుంది. పేరు కనబడదు. దీని వల్ల మెసేజ్ చేసిన వ్యక్తి ఎవరో అనేది గుర్తించడం కష్టమవుతుంది. అయితే త్వరలో సరికొత్త ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ తో అపరిచితుల నంబర్ బదులు పేరు కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి వాట్సాప్ లో ఏ పేరైతే పెట్టుకుంటారో ఆ పేరు కనిపిస్తుంది.
వాట్సాప్ గ్రూప్ లో మెసేజులకు ఎక్స్పైరీ ఆప్షన్ ఉందన్న విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలో వాట్సాప్ గ్రూప్ కే ఎక్స్పైరీ ఆప్షన్ చూస్తారు. కేవలం కొన్ని రోజులకు పరిమితంగా తాత్కాలిక గ్రూప్ ని క్రియేట్ చేసుకునే వారి కోసం ఈ ఫీచర్ ను తీసుకొస్తున్నారు. అంటే గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రూప్ ఎన్ని రోజులు ఉండాలని ఆప్షన్ అడుగుతుంది. అక్కడ మెన్షన్ చేసే రోజులను బట్టి గ్రూప్ వ్యాలిడిటీ ఆధారపడి ఉంటుంది. ఆ రోజులు ముగియగానే గ్రూప్ ఎక్స్పైర్ అయిపోతుంది.
ఇక బెస్ట్ ఫీచర్.. మీ కాంటాక్ట్స్ లో లేని నంబర్ నుంచి మీకు వాట్సాప్ కాల్స్ వస్తే ఆ కాల్ మ్యూట్ లోకి వెళ్లిపోవడం.. లేదా బ్లాక్ అవ్వడం లాంటివి జరుగుతాయి. మనకు పరిచయం లేని వ్యక్తి నుంచి కాల్ వస్తే ఆ కాల్ మ్యూట్ లోకి వెళ్లేలా ఒక ఫీచర్ ను తీసుకొస్తున్నారు. కాల్స్ లిస్టులోకి వెళ్లి ఎవరైనా కాల్ చేశారేమో అని చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్లు ఇవే. బీటా వినియోగదారులకు టెస్టింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. త్వరలో వినియోగదారులు వీటిని పొందవచ్చు. మరి వాట్సాప్ తీసుకొస్తున్న ఈ సరికొత్త ఫీచర్లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.