ప్రస్తుతం వినియోగంలో ఉన్న సోషల్ మీడియా యాప్స్‌లో అత్యధిక ఆదరణ ఉన్నది.. అత్యధికంగా వినియోగించేది వాట్సాప్. ఒకప్పుడు ఉత్తరాలు మనుషుల మధ్య ఎలా సమాచారాన్ని చేరవేశాయో.. ప్రస్తుతం వాట్సాప్ ఆ పని చేస్తుంది. అయితే దీని వల్ల కొన్ని సార్లు కీడు కూడా జరుగుతుంది. వాటి గురించి పక్కన పెడితే పలు సందర్భాల్లో వాట్సాప్ కొన్ని ఖాతాలను బ్యాన్ చేస్తుంది. దాని నిబంధనలు, షరతులను పాటించకోతే.. వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇలా అకౌంట్‌లను బ్యాన్ చేసిన సందర్భంలో దాన్ని తిరిగి యాక్టీవేట్ చేసుకోనే అవకాశం లేదు. ఈ క్రమంలో వినియోగదారుల సూచనలను దృష్టిలో పెట్టుకుని.. బ్యాన్ చేసిన అకౌంట్స్‌ని తిరిగి యాక్టీవేట్ చేయమని రిక్వెస్ట్ చేసుకునేందుకు త్వరలోనే ఇందుకు సంబంధించి ఓ యంత్రాగాన్ని అందుబాటులోని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది వాట్సాప్.
ఈ వారం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌తో వచ్చిన WABetainfo ద్వారా అప్‌డేట్ వస్తుంది. దీన్ని సెలక్ట్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ ఖాతాని బ్యాన్ చేస్తే.. తిరిగి యాక్టీవేట్ చేయాల్సిందిగా అప్పీల్ చేసుకోలరు. ఈ క్రమంలో వినియోగదారులు వాట్సాప్‌కు కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుందని నివేదికలో తెలిపింది. వీటిని ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా దర్యాప్తు చేసి నిషేధాన్ని ఉపసంహరించుకోవడానికి గల కారణాలు చట్టబద్ధమైనవేనా.. లేదా అని క్రాస్-చెక్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: LIC నుంచి అద్భుతమైన ప్లాన్.. రూ.100 పెట్టుబడితో 20 లక్షలు!
కొన్ని సందర్భాల్లో వాట్సాప్ పొరపాటున ఒకరి ఖాతాను నిషేధించే అవకాశాలు ఉన్నాయి, అలాంటి సందర్భాలలో, ఇలా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల యూజర్లకు ఎంతో ఉపయోగంగా ఉండనుంది. ఈ క్రమంలో యూజర్లు ఇచ్చిన వివరాలు సరైనవే అని రుజువయితే.. వారి అకౌంట్‌ని తిరిగి రీయాక్టీవేట్ చేస్తారు.వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోందని, రాబోయే వారాల్లో ఐఓఎస్‌లో కూడా అందుబాటులోకి వస్తుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు.
వాట్సాప్ అకౌంట్‌ని ఎందుకు నిషేధిస్తుంది
వాట్సాప్ యూజర్ అకౌంట్‌ని బ్యాన్ చేయడానికి అనేక కారణాలున్నాయి. వాట్సాప్ అకౌంట్‌ని బ్యాన్ చేయడానికి మెషిన్ లెర్నింగ్, వినియోగదారు నివేదికలను ఉపయోగిస్తుంది.ఆటోమేటెడ్ ప్రాసెస్‌ని ఉపయోగించి యూజర్స్ వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేయడం మానుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది. వినియోగదారులు Google Play Store లేదా Apple App Store వెలుపల ఇన్‌స్టాల్ చేసిన వాట్సాప్ అప్‌డేట్స్‌ని వినియోగించకూడదని సూచించింది. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరి కొత్త ఫీచర్లతో ప్రయోగాలు చేస్తూనే ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఈ కొత్త ఫీచర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.