వాట్సాప్ వచ్చిన కొత్తలో కేవలం మెసేజ్‌లు పంపిచుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ.. కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌లో ఫోటోలు, మెసేజ్‌లు, వీడియో కాలింగ్ ఆప్షన్‌లు మాత్రమే కాక.. పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. ఇలా ఎప్పటికప్పుడు వాట్పాప్ అప్‌డేట్ అవుతూ.. యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్ ప్రత్యేకించి మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. మహిళల జీవితంలో అతి ముఖ్యమైన రుతుక్రమాన్ని ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ఆధారంగా మహిళలు తమ రుతుక్రమాన్ని అంచనా వేయడం.. అందుకు తగ్గట్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యం అవుతోంది.
మహిళలు తమ పీరియడ్స్‌ను ట్రాక్ చేయడంలో సహాయపడటానికి వాట్సాప్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి పీరియడ్ ట్రాకర్‌ని రూపొందించింది. వాట్సాప్ ద్వారా వినియోగదారులకు సులభంగా యాక్సెస్ అందించడానికి సిరోనా ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్-ఆధారిత, సహజమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ సేవను పొందడానికి.. మీరు 9718866644కు ‘హాయ్’ని పంపాలి. పీరియడ్ ట్రాకింగ్ అప్లికేషన్ మూడు లక్ష్యాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించవచ్చు: పీరియడ్స్, ట్రాక్ చేయడం, గర్భం దాల్చడం. .
వాట్సాప్‌లో మీరు మీ రుతుక్రమాన్ని ఎలా ట్రాక్ చేయవచ్చో ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరించారు.
ఆ వివరాలు..
1. మీ కాంటాక్స్‌కి 9718866644 నంబర్‌ని యాడ్ చేయడండి.
2.ఆపై వాట్సాప్‌లో “హాయ్” అని పంపండి. సిరోనా ఆప్షన్స్ జాబితాను అందిస్తుంది
3.మీ పీరియడ్స్ ట్రాక్ చేయడానికి, చాట్ బాక్స్‌లో “పీరియడ్ ట్రాకర్” అని రాయండి
4.ఆ తర్వాత మీరు మీ పీరియడ్ వివరాలను నమోదు చేయమని అడుగుతుంది.
5.సిరోనా మీకు మీ పీరియడ్ వివరాలు చూపుపతోంది.. అనగా చివరి పీరియడ్, తరువాతి పీరియడ్, రుతుక్రమ వ్యవధి తదితర వివరాలు.
చాట్‌బాట్ వినియోగదారు లక్ష్యాల ఆధారంగా రిమైండర్‌లు, రాబోయే సైకిల్ తేదీలను రికార్డ్ చేస్తుంది, షేర్ చేస్తుంది. పీరియడ్ ట్రాకర్‌ను రూపొందించడానికి WhatsApp బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగించారు. ఇది ఒక సహజమైన చాట్‌బాట్ ఇంటర్‌ఫేస్ ఆధారితంగా పని చేస్తుంది. ఈ సరికొత్త ఫీచర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.