Google TakeOut in Telugu: మనకు తెలియని ఏ విషయంపైనా సమగ్ర సమాచారం కావాలంటే ముందుగా గుర్తొచ్చేది.. ‘గూగుల్’. ఇంటర్నెట్ ఆన్ చేసి గూగుల్ లో శోధించగానే మనకు తెలియని పూర్తి సమాచారం క్షణాల్లో మనముందుటుంది. అలాంటి గూగుల్ టూల్స్‌లో ఒకటే ఈ 'గూగుల్ టేకౌట్'. ఈ టూల్ సహాయంతోనే పోలీసులు కేసులను చేధిస్తున్నారని వినికిడి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటున్న హత్య కేసులను సైతం దీని సహాయంతో ఒక కొలిక్కి తీసుకొస్తున్నారట. దీంతో ఏంటా సాంకేతికత..? దీని ప్రయోజనాలు ఏంటి..? పోలీసులు దీన్ని ఎలా యూజ్ చేస్తారు..? వంటి విషయాలపై నెటిజన్లు ఎక్కువగా శోధిస్తున్నారు..?
హత్య చేశాక పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితులు ప్రయత్నాలు చేయడమన్నది సాధారణ విషయం. అలా ఒకటి రెండు ప్రయత్నాలు చేసి.. పోలీసులు మమ్మల్ని పట్టుకోలేరన్న ధీమాతో వారు సమాజంలో మెలుగుతుంటారు. అలాంటి వారిని భయపెట్టే ‘సాంకేతికత’ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ సాంకేతికత సహాయంతో పోలీసులు వారి ప్రతి కదలికను తెలుకోగలరట. కాల్ డేటా, సెల్‌ఫోన్ లొకేషన్లు, వారు దాక్కున్న ప్రదేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని ట్రాక్ చేయొచ్చట. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
మనకు తెలియని ఏ విషయంపైనా సమగ్ర సమాచారం కావాలంటే ముందుగా గుర్తొచ్చేది.. ‘గూగుల్’. ఇంటర్నెట్ ఆన్ చేసి గూగుల్ లో శోధించగానే మనకు తెలియని పూర్తి సమాచారం క్షణాల్లో మనముందుటుంది. అలాంటి గూగుల్ టూల్స్‌లో ఒకటే ఈ ‘గూగుల్ టేకౌట్’. ఈ టూల్ సహాయంతోనే పోలీసులు కేసులను చేధిస్తున్నారని వినికిడి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటున్న హత్య కేసులను సైతం దీని సహాయంతో ఒక కొలిక్కి తీసుకొస్తున్నారట. దీంతో ఏంటా సాంకేతికత..? దీని ప్రయోజనాలు ఏంటి..? పోలీసులు దీన్ని ఎలా యూజ్ చేస్తారు..? వంటి విషయాలపై నెటిజన్లు ఎక్కువగా శోధిస్తున్నారు..? ఆ సాంకేతికత పేరు గూగుల్ టేకౌట్. ఈ క్రమంలో గూగుల్ టేకౌట్ సాంకేతికత గురించి పూర్తి సమాచారం మీకోసం..
యూజర్ యొక్క డేటాను సురక్షితంగా బ్యాకప్ చేయడానికి ‘గూగుల్ టేకౌట్’ అనే టూల్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇది పూర్తిగా ఉచితం. ఇది 51 రకాల డేటాను బ్యాకప్ చేయగలదు. మెయిల్స్, డ్రైవ్ కంటెంట్, క్యాలెండర్స్, బ్రౌజర్‌లో ఉండే బుక్‌మార్క్స్, సెర్చ్ హిస్టరీ, యూట్యూబ్‌లో యూజర్ రెగ్యులర్‌గా చూసే వీడియోలు.. ఇలా యూజర్ యొక్క ప్రతి కదలికను బ్యాకప్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఈ డేటాను యూజర్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే.. ఇది యూజర్ కోసం తీసుకొచ్చిన పెట్టిన ఫీచర్. ఇప్పుడు ఇదే పోలీసులకు కీలకంగా మారుతోంది.
కొలిక్కి రాని కేసుల విచారణ సమయాల్లో దర్యాఫ్తు సంస్థలు అనుమానమొచ్చిన వ్యక్తుల డేటాను యాక్సెస్ చేసే పర్మిషన్ ఉంటుంది. దీంతో దర్యాప్తు సంస్థలు వారి వారి గూగుల్ టేకౌట్ డేటాను పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది. ఇందులో యూజర్ల చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉంటుండడంతో వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడుతున్నారట. ఇక్కడ మీకో సందేహం రావొచ్చు.. వారు ఎన్ని ఫోన్లు వాడుతున్నారో..? ఎన్ని ఫోన్ నంబర్లు వాడుతుంటారో..? అన్న అనుమానం. వారు ఎన్ని కుయుక్తులు ట్రై చేసినా, వారున్న లొకేషన్ ఆధారంగా.. వారు ఎన్ని మొబైల్స్ వాడారు?.. వాటి ఐఎంఈఐ నంబర్లు ఏంటి? వంటి ప్రతి విషయాన్ని పోలీసులు పసిగట్టేస్తారట. ఇన్ని తెలిసిన వారికి గూగుల్ టేకౌట్ డేటా కనుక్కోవడం అంత కష్టమైన పని కాకపోవచ్చు.
అందులోనూ.. ఫోన్ నెంబర్ ద్వారా నిందితుడిని పట్టుకోవడం అంటే టవర్ రేడియస్ లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందట. పైగా కచ్చితమైన లొకేషన్ తెలియదని తెలుస్తోంది. అదే గూగుల్ టేకౌట్ ద్వారా అయితే నిందితుడు ఉన్నటువంటి 50 మీటర్ల రేడియస్ లోపే గుర్తించవచ్చట. ఈ విధంగా అధికారులు ఈ సాంకేతికతను ఉపయోగించి నిందితుల్ని పట్టుకుంటున్నారన్నమాట.
ముందుగా గూగుల్‌లోకి వెళ్లి ‘గూగుల్ టేకౌట్’ అని టైప్ చేస్తే లాగిన్ అడుగుతుంది. ఈమెయిల్ వివరాలతో లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో వివిధ గూగుల్ యాప్‌ల నుంచి మొదలు కాంటాక్ట్ లిస్ట్, యూజర్ల వ్యక్తిగత ఫోటోలు, సెర్చ్ హిస్టరీ, మ్యాప్ లొకేషన్స్, సేవ్డ్ ఫైల్స్.. ఇలా ప్రతి ఫైల్ యొక్క డేటా జాబితాను చూపిస్తుంది. ఈ సమాచారాన్ని మీరు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. డిఫాల్ట్‌గా ప్రతి ఫైల్ సెలెక్ట్ చేసి ఉంటుంది. మీకు అవసరం లేని దాన్ని తప్పించవచ్చు. మీరు ఉపయోగించాలనుకుంటున్న డేటాను మాత్రమే ఎంచుకోవచ్చు.
ఈ లెక్కన గూగుల్ టేకౌట్ బ్యాకప్ పరిష్కారమా..? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే.. డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, ఎక్స్‌పోర్ట్ చేయడానికి అనుమతించినప్పటికీ సడెన్‌గా డేటా డిలీట్ అవ్వడం, లేదా ఇతర మార్గాల్లో డేటాకు నష్టం జరిగినప్పుడు గూగుల్ టేకౌట్ ఎలాంటి భద్రత ఇవ్వదు. రికవరీ చేయడానికి కూడా సాధ్యపడదు. ఒకవేళ రికవరీ జరిగినా..ఆ డేటా వివిధ ఫార్మాట్స్‌లో ఉంటుందట. జిప్ ఫార్మాట్‌లోకి డౌన్ లోడ్ అవుతుందని తెలుస్తోంది. దీన్ని మళ్లీ యథాస్థితికి తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పనిగా టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.