కాలంతో పని లేకుండా ఫ్యాన్ తిరగాల్సిందే. ఇక వేసవి కాలంలో అయితే 24 గంటలు నడవాల్సిందే. కాసేపు కరెంట్ పోయిందా ఇక అంతే సంగతులు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే..
ఇంట్లో అడుగు పెట్టగానే ఫ్యాన్ తిరగాల్సిందే.. ఇక వేసవి కాలం.. ఒక్క నిమిషం ఫ్యాన్ ఆగినా ఊపిరి ఆగిపోతుంది. భరించలేని వేడి, ఉక్కపోత. అందుకే ఒక్క సెకను ఫ్యాన్ తిరగపోయినా ఇక అంతే. కానీ వేసవి కాలంలో.. కరెంట్ కోతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే గంటలు గంటలు ఉంటాయి. కరెంట్ కోతల సమస్య లేకపోయినా.. 24 గంటలు ఫ్యాన్ తిరిగితే జేబుకు చిల్లు పక్కా. బిల్లు తడిసిమోపెడవుతుంది. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి.. కరెంట్ లేకపోయినా.. ఫ్యాన్ తిరగాలి.. బిల్లు రాకూడదు అంటే ఏం చేయాలి..
కరెంట్ పోయినా.. ఇన్వర్టర్ పెట్టే పని లేకుండా.. ఫ్యాన్ తిరుగుతుంది.. బిల్లు రాదు.. ఎలా అంటే.. ఓ చిన్న పరికరం మీ దగ్గర ఉంటే చాలు. దీన్ని అమర్చుకుంటే.. అదే కరెంట్ జనరేట్ చేస్తుంది.. బిల్లు రాదు.. ఫ్యాన్ కూడా ఆగదు. ఇంతకు ఆ పరికరం ఏంటి అంటే హైడ్రో జనరేటర్. చాలా చిన్నగా ఉండే ఈ పరికరంతో మీ వాటర్ ట్యాంక్ నుంచి విద్యుత్‌ని తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.