ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ ఎలక్ట్రిక్ కార్లు, బైకుల వైపే మొగ్గు చూపుతున్నాయి. అలా చేయడం వల్ల పర్యావరణం బాగుండటమే కాకుండా.. వారి జేబుకి కూడా చిల్లు పడకుండా ఉంటుంది. ఇప్పటికే అన్ని ప్రముఖ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడం ప్రారంభించాయి. తాజాగా ఫోక్స్ వేగన్ తమ ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది.
ప్రీమియం- లగ్జరీ కేటగిరీలో ఫోక్స్ వేగన్ కార్ ఉత్తమ ఎంపిక అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లగ్జరీ కార్లలో ఫోక్స్ వేగన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సేఫ్టీ, కంఫర్ట్ లో మాత్రం ప్రీమియం ఎక్స్ పీరియన్స్ తప్పకుండా ఉంటుంది. ఫోక్స్ వేగన్ కూడా ఈవీ రంగంలో అడుగుపెట్టిన సగంతి తెలిసిందే. ఇప్పటికే ఫోక్స్ వేగన్ నుంచి ID సిరీస్ లో ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయి. ఐడీ.ఆర్ నుంచి ఐడీ.6 వరకు ఫోక్స్ వేగన్ సంస్థ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్త మోడల్ వచ్చి చేరింది. తాజాగా ఫోక్స్ వేగన్ ఐడీ.7 ప్రో, ఐడీ.7 ఎస్ ప్రో ఎలక్ట్రిక్ కారు మోడల్స్ ను రిలీజ్ చేసింది. ఈ కార్ల లుక్స్, ఫీచర్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఎలక్ట్రిక్ కార్లలో ఫోక్స్ వేగన్ సంస్థ దూకుడు మీదుంది. ఇప్పటికే పలు మోడల్స్ రిలీజ్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు గ్లోబల్ లెవల్లో తమ కొత్త ఎలక్ట్రిక్ ఫ్లాగ్ ఫిప్ సెడాన్ మోడల్ ఐడీ7ని విడుదల చేసింది. ఈ కారు లుక్స్ పరంగా స్టన్నింగ్ గా ఉంది. ఫ్రంట్ ఎంతో సింపుల్ డిజైన్ తో ఉంది. ఫోక్స్ వేగన్ కంపెనీ లోగో హైలెట్ అవుతూ ఎంతో కొత్తగా ఉంది. ఈ కారు డ్రైవ్ రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఈ కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా.. 700 కిలీమీటర్లు డ్రైవ్ రేంజ్ లభిస్తుంది. ఈ ఫోక్స్ వేగన్ ఐడీ7 కారు టెస్లా మోడల్ 3, బీఎం డబ్ల్యూ i4, పోల్ స్టార్ 2 మోడల్స్ ఈవీ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.
Volkswagen представил топовую модель ID.7 EV
Электрический седан Volkswagen ID.7 дебютировал на мероприятии перед Шанхайским автосалоном. Авто может проехать до 435 миль (700 км) на одной зарядке в цикле WLTP.
Производитель планирует представить еще 10 моделей электро к 2026 г pic.twitter.com/tEDxT8C1sh
— STARLINK (@lgj170) April 18, 2023
ఈ ఫోక్స్ వేగన్ ఐడీ.7 ప్రో ఎస్ మోడల్ కారులో 82 కిలోవాట్స్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఫోక్స్ వేగన్ ఈవీలలో ఈ బ్యాటరీ వాడటం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఫోక్స్ వేగన్ ఈవీ కేటగిరీల్లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే కారు కూడా ఈ ఎస్ ప్రో అనే చెబుతున్నారు. 200 కిలో వాట్స్ స్పీడ్ తో ఛార్జ్ అవుతుందని వెల్లడించారు. ఇంక ఐడీ ప్రో మోడల్ 615 కిలీమీటర్ల రేంజ్ తో వస్తోంది. 170 కిలీ వాట్స్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తోంది. ఈ మోడల్స్ సింగిల్ మోటర్, రేర్ వీల్ డ్రైవ్ తో వస్తున్నాయి. ఈ కారు మోడల్స్ జర్మనీ, చైనాల్లో ఉత్పత్తి చేయనున్నారు. వీటిని యూరోపియన్, నార్త్ అమెరికా, చైనా మార్కెట్లలో విక్రయిస్తారు. యూరోపియన్, చైనా మార్కెట్లలో ఈ కారు 2023లో అందుబాటులోకి వస్తుంది. నార్త్ అమెరికాలో మాత్రం 2024లో విక్రయిస్తారు. భారత్ లో ఈ ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
The Volkswagen ID 7 has been fully revealed as a key rival to the Tesla Model 3 ⚡ With 282bhp and up to 435 miles of range, it will be VW’s flagship EV https://t.co/Hmddh9Bq6D pic.twitter.com/RiNWwGiOZJ
— Autocar (@autocar) April 18, 2023