VI కస్టమర్లకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో 3 సరికొత్త 30 డేస్‌ ప్లాన్స్‌ విడుదల!

సెల్ ఫోన్ కొనడం కంటే.. వాటికి రీఛార్జ్ చేయించడానికే ప్రజలు తెగ ఆలోచిస్తున్నారు. ఏ ప్లాన్ తీసుకోవాలి? ఎంత ప్లాన్ తీసుకోవాలి? అనే ప్రశ్నలు వస్తన్నాయి. పైగా ప్లాన్ డీటెయిల్స్ చూస్తే 28 డేస్, 22 డేస్ వ్యాలిడిటీ అని చెబుతుంటారు. అయితే వీఐ కంపెనీ మాత్రం వారి కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 3 టారిఫ్ ప్లాన్స్ తీసుకొచ్చింది.

వొడాఫోన్- ఐడియా రెండు కంపెనీలు ఇప్పుడు వీఐగా మారిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఈ మొబైల్ నెట్ వర్క్ వినియోగదారులు తగ్గిన మాట వాస్తవమే. కానీ, ఇప్పిటికీ వీఐకి లాయల్ కస్టమర్స్ ఉన్నారు. వారికోసం మెరుగైన సేవలు అందించేందుకు ఈ కంపెనీ కృషిచేస్తోంది. ఇప్పుడు తాజాగా తమ కస్టమర్స్ కోసం వీఐ కంపెనీ ఒక కొత్త మొబైల్ టారిఫ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. అది కూడా 30 డేస్‌ వ్యాలిడిటీతో ప్లాన్స్‌ తీసుకురావడం విశేషం. ఆ టారిఫ్ ప్లాన్ ఎంత? ఆ ప్లాన్ లో వీఐ కస్టమర్స్ కు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

నిజానికి చాలా కంపెనీలు ఇప్పటికీ 28 రోజుల గడువునే కొనసాగిస్తున్నాయి. కేవలం ఒకటి లేక రెండు మాత్రమే వన్ మంత్ వ్యాలిడిటీతో ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం వన్ మంత్ వ్యాలిడిటీతో రూ.195, రూ.296, రూ.319 ధరలో మొత్తం 3 ప్లాన్స్‌ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ లో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయో చూద్దాం. ముందుగా రూ.195 ప్లాన్ చూసుకుంటే.. ఇందులో 3 జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. అలాగే వీఐ మూవీస్, టీవీకి నెల రోజులపాటు ఉచితంగా యాకెస్ లభిస్తుంది.

ఇంక రూ.296 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ టారిఫ్ లో జియో- ఎయిర్ టెల్ నెట్ వర్క్ లతో వీఐ పోటీ పడుతోంది. వాళ్లతో సమానంగా టారిఫ్ ని నిర్ణయించింది. ఈ ప్లాన్ లో 25 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. అలాగే వీఐ యాప్ ద్వారా వీఐ సినిమా, వీఐ టీవీకి ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. అలాగే రూ.319 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ రెండు ప్లాన్స్ కన్నా కూడా కాస్త ఎక్కువగానే ఆఫర్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ లో రోజుకి 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు, 2 జీబీ వరకు బ్యాకప్ డేటా, వీకెండ్ డేటా రోలోవర్ వంటి ఎన్నో వెసులుబాట్లను ఈ ప్లాన్ లో పొందు పరిచారు. వొడాఫోన్ ఐడియా కంపెనీ తీసుకొచ్చిన ఈ 30 డేస్ ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV