వివో ఇండియా భారత మార్కెట్ లోకి మరో స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసింది. వై సిరీస్ లో.. ‘వివో వై35’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లో 8జీబీ ర్యామ్ + 8జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో మొత్తం కలిపి 16జీబీ ర్యామ్, 128జీబీ ఎక్సటర్నల్ స్టోరేజ్, 50 మెగాపిక్సల్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అందులోనూ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేయడం విశేషం. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ధర:
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే వివో వై35 రిలీజైంది. ధర రూ.18,499. అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, వన్ కార్డ్‌తో కొంటే రూ.1,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే.
స్పెసిఫికేషన్స్:
దీనికి అదనంగా.. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్‌తో 8జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే.. మొత్తం 16జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. అలాగే.. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో మల్టీ టర్బో మోడ్, అల్‌ట్రా గేమ్ మోడ్ లాంటి ఫీచర్స్, సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ వేక్ ఫీచర్స్ ఉన్నాయి.
#Vivo Y35 launched in India today
6.58″ FHD+ 90Hz LCD display
Snapdragon 680
50+2+2MP rear
16MP selfie
5000mah + 44W FC
Android 12
SD card slotPrice: 8/128GB @ Rs. 18,999/-#VivoY35 pic.twitter.com/5WBOKbw6PT
— Tunk Sai Kumar ❂ (@tsaikumar1989) August 29, 2022