చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. వివో టీ1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్లలో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. 50ఎంపీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అధునాతన ఫీచర్లతో.. బడ్జెట్ ధరలో ఈ మొబైల్ ను లాంచ్ చేసింది.
వివో టీ1 ఎక్స్ ధర, ఆఫర్స్:
వివో టీ1ఎక్స్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999.
ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 27న సేల్ ప్రారంభం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వివో టీ1ఎక్స్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.10,999 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.11,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.
వివో టీ1 ఎక్స్ స్పెసిఫికేషన్స్:
Arm yourself with the all-new #vivoT1x that gets you, and your action-packed life! Take your gaming experiences to the max with Turbo Snapdragon 680 Processor, while you stay uber cool with the Segment’s First Turbo 4 Layer Cooling System.
Sale starts 27th July on @Flipkart pic.twitter.com/YhIlm5MQye
— Vivo India (@Vivo_India) July 20, 2022