ట్విట్టర్ సంస్థను ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు, యూజర్లకు షాకుల మీద షాకులిచ్చిన ట్విట్టర్ మరోసారి యూజర్లకు షాకిచ్చేందుకు సిద్ధమైంది.
షార్ట్ బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ సామాజిక మాధ్యమానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. ఇటీవల ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మస్క్ వచ్చిన తర్వాత లే ఆఫ్స్ నుంచి కార్యాలయాలను క్లోజ్ చేయడం వరకు ప్రతిది వార్తల్లో నిలిచింది. మస్క్ కూడా అన్నీ అలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలనే తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ ఖాతాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది నిజమీ? ప్రాంకా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
విషయం ఏంటంటే.. ట్విట్టర్ సంస్థ తాజాగా ఒక ట్వీట్ చేసింది. బ్లూ టిక్ కలిగి.. బ్లూ వెరిఫికేషన్ సబ్ స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లు అన్నీ ఏప్రిల్ 1 నుంచి అన్ వెరిఫైడ్ లిస్ట్ లోకి వెళ్లిపోతాయని తెలిపారు. అంటే ఏప్రిల్ 1లోపు బ్లూ బ్యాడ్జ్ కలిగిన వాళ్లు బ్లూటిక్ సబ్ స్క్రైబ్ చేసుకోకపోతే వారిని వెరిఫికేషన్ ను తొలగిస్తారు అనమాట. వారికి బ్లూ టిక్ కావాలి అంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. అలా చేయని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి బ్లూ బ్యాడ్జ్ ని తొలగిస్తారు. దాదాపు కొన్ని కోట్ల ఖాతాలు ఇంకా బ్లూబ్యాడ్జ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోలేదని చెబుతున్నారు.
Twitter Blue is now available globally! Sign up today to get your blue checkmark, prioritized ranking in conversations, half ads, long Tweets, Bookmark Folders, custom navigation, Edit Tweet, Undo Tweet, and more. Sign up here: https://t.co/SBRLJccMxD
— Twitter Blue (@TwitterBlue) March 23, 2023
మరి.. అందరి ఖాతాలను నిజంగానే అన్ వెరిఫైడ్ చేస్తారా? లేక ఏప్రిల్ 1 కాబట్టి.. హ్యాపీ ఫూల్స్ డే అంటారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలన్ మస్క్ ఇప్పటికే చాలా విషయాల్లో ప్రామిస్ లు చేసి వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. అందుకే ఈ విషయంలో కూడా ఎలన్ మస్క్ అంత సీరియస్ గా ఉండరు ఏమో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇండియాలో ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.900గా ఉన్న విషయం తెలిసిందే. బ్లూ బ్యాడ్జ్ తీసుకోవడం ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ యూజర్లకు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కోసం మరో విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు.
On April 1st, we will begin winding down our legacy verified program and removing legacy verified checkmarks. To keep your blue checkmark on Twitter, individuals can sign up for Twitter Blue here: https://t.co/gzpCcwOpLp
Organizations can sign up for https://t.co/RlN5BbuGA3…
— Twitter Verified (@verified) March 23, 2023