టెక్నాలజీ వినియోగం పెరిగాక ఆన్ లైన్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌కి వెళ్లి క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్షణాల్లో కరెంట్ బిల్ కట్టేయొచ్చు. ఇదొక్కటేకాదు.. మనీ ట్రాన్సఫర్, మొబైల్ రీఛార్జులు, గ్యాస్ బుకింగ్స్, స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, వాటర్ బిల్లులు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో రకాల సేవలు క్షణాల్లో పొందవచ్చు. అయితే, ఈ టెక్నాలజీ మనకే కాదు సైబర్ నేరగాళ్లకు కూడా బాగా ఉపయోగపడుతోంది. చదువుకోని వాల్లనే కాదు, చదువుకున్న వాళ్లను కూడా వీళ్ళు మభ్యపెడుతూ అందినకాడికి దోచేస్తున్నారు. అందుకే యూపీఐ పేమెంట్స్ విషయంలో అప్రమత్తత అవసరం. యూపీఐ మోసాలను తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకోండి.
క్యూఆర్ కోడ్ స్కాన్ మోసాలతో జాగ్రత్త..
సైబర్ మోసగాళ్లు ముందుగా పేమెంట్ రిక్వెస్ట్ అంగీకరించమని అడుగుతారు. లేకపోతే లావాదేవీ విఫలమవుతుందని చెబుతూ వారిని బట్టులో పడేస్తారు. మీరు పేమెంట్ రిక్వెస్ట్ ను అంగీకరించినప్పుడు, UPI యాప్ మిమ్మల్ని లావాదేవీకి చివరి దశ అయిన పిన్‌ని అడుగుతుంది. అంటే మీరు UPI PINని నమోదు చేసిన వెంటనే, మీ డబ్బు లాగేసుకుంటారు. ఈ విషయంలో అప్రమత్తత చాలా అవసరం.
Avoid being a victim of cyber fraud. You don’t need UPI PIN to receive money. Stay Alert and Stay Safe. #UnionBankofIndia #GoodPeopleToBankWith #CyberSafe #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/kDylFG7sOt
— Union Bank of India (@UnionBankTweets) February 8, 2022
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యూపీఐ మోసాలను కొంతమేర తగ్గించవచ్చు. మోసగాళ్లకు మీరు టార్గెట్ కాకుండా బయటపడవచ్చు. ఈసారి యూపీఐ పేమెంట్స్ చేసేప్పుడు ఈ విషయాలన్నీ తప్పక గుర్తుంచుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియాజేయండి.