ఏడాదికి పన్నెండు నెలలున్నా.. సెప్టెంబర్ నెల మాత్రం టెక్ ప్రియులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌లో టెక్ దిగ్గజం యాపిల్ తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంది. ఈసారి కూడా ఐఫోన్ 14 సిరీస్ లో పలు మోడళ్లను విడుదల చేయనుంది. వీటితో పాటు షావోమీ, మోటోరోలా, వివో, రియల్‌మీ, పోకో సహా మరిన్ని బ్రాండ్స్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ల కూడా అడుగుపెట్టనున్నాయి. ఫ్లాగ్‌షిప్ రేంజ్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ మోడల్స్ లాంచ్ కానున్నాయి. మరి సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న ఆ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో ఇప్పుడు చూడండి.
ఐఫోన్ 14 సిరీస్:
యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ను ఈనెల 7న లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్ లో నాలుగు మోడళ్లు.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అడుగుపెట్టనున్నాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, కొత్త ఐప్యాడ్, ఎయిర్‌పోడ్స్‌ను కూడా అదే రోజు లాంచ్ చేయనుంది. లాంచ్ అయిన వరం రోజుల తరువాత అందుబాటులో ఉండనున్నాయి.
పోకో ఎం5:
షావోమీ సబ్‌బ్రాండ్ పోకో నుంచి బడ్జెట్ రేంజ్‌లో.. పోకో ఎం5 స్మార్ట్‌ఫోన్ ఈనెల 5వ తేదీన ఇండియాలో అడుగుపెట్టనుంది. 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 500ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. తక్కువ ధర రేంజ్‌లో గేమింగ్ ఫోన్‌గా పోకో దీన్ని హైలైట్ చేస్తోంది.
రియల్‌మీ జీటీ నియో 3టీ:
జీటీ నియో 3టీ ఆగస్టులో విడుదల వస్తుందని అంచనాలు వచ్చినా.. అలా జరగలేదు. అయితే సెప్టెంబర్‌లో లాంచ్ కానున్నట్లు రియల్‌మీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. స్నాప్‌డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లేతో ప్రీమియమ్ మిడ్ రేంజ్‌లో ఈ ఫోన్ రానుంది.
రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ:
ఈనెల 6న రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌తో బడ్జెట్ రేంజ్‌లో ఈ ఫోన్ రానుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా & మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్:
చైనాలో మోటో ఎక్స్30 ప్రోగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రాగా రానుందని తెలుస్తోంది. 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 512జీబీ స్టోరేజ్, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు మరిన్ని ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో మోటోరోలా ఎడ్జ్ 30 రానుంది. అలాగే.. మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ మొబైల్ కూడా ఇదేనెలలో విడుదల కానుంది. మిడ్ రేంజ్‌లో పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోనన్ వచ్చే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో ఈ మొబైల్ రానుంది.
షావోమీ 12ఎస్ అల్ట్రా:
చైనాలో జూలైలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఈ నెలలో భారత్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ రెంజులో ఈ మొబైల్ రానుంది. 6.73 ఇంచెస్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, బ్యాక్ క్వాడ్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సల్ కెమెరా వంటి ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ రానుంది.
జియో ఫోన్ 5జీ:
తక్కువ ధరలో జియో, 5జీ చేస్తున్నట్లు సంకేతాలు వచ్చినప్పటికీ.. ఎప్పుడు లాంచ్ చేయనుందో సమాచారం లేదు. స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్, 6.5 ఇంచెస్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే, 13 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సల్ అదనపు కెమెరా సెటప్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000ఎంహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ధర రూ. 10,000 లోపు ఉంటుందని అంచనా.
వీటితో పాటు షావోమీ 12 లైట్, ఐక్యూ జెడ్ 6 లైట్, ఆసుస్ రోగ్ ఫోన్ 6జీ అల్టిమేట్, మోటోరోలా ఎడ్జ్ 30 లైట్, రియల్ మీ క్యూ 5, వివో టీ1 ఎక్స్, ఒప్పో ఏ57 5జీ.. వంటి మరిన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి.