యాపిల్ కంపెనీకి భారత్ లో ఎంతో గొప్ప మార్కెట్ ఉంది. యాపిల్ ప్రొడక్టులను భారతీయులు ఎగబడి కొంటారు. రాబోయేకాలంలో యాపిల్ సంస్థకు భారత్ ప్రధాన మార్కెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే యాపిల్ తమ రిటైల్ స్టోర్ ని కూడా భారత్ లో ప్రారంభించనుంది. అందుకు టిమ్ కుక్ కూడా హాజరుకానున్నట్లు చెబుతున్నారు.
యాపిల్ కంపెనీ ప్రొడక్టులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. యువత అయితే యాపిల్ ఫోన్, వాచ్, ఎయిర్ పోడ్స్ కొనడం వాల్ల డ్రీమ్ గా పెట్టుకుంటారు. ఇంక సెలబ్రిటీలు అయితే వచ్చిన ప్రతి యాపిల్ ప్రొడక్టును కొనేస్తుంటారు. ప్రపంచంలో యాపిల్ ఉత్పత్తులకు భారత్ నెంబర్ వన్ మార్కెట్ గా అవతరిస్తోంది. ఆఖరి త్రైమాసికంలో యాపిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కానీ, ఒక్క భారత్ లో మాత్రం యాపిల్ సంస్థ లాభాల్లో నిలిచింది. అందుకే ఎప్పుడు టిమ్ కుక్ భారత మార్కెట్ లో మరింత శక్తివంతంగా అవతరించాలని భావిస్తున్నారు.
యాపిల్ కు భారత్ లో ఎంత గొప్ప మార్కెట్ ఉన్న కూడా భారత్ లో మాత్రం స్టోర్ లేదు. 2020లో మొట్టమొదటిసారి ఆన్ లైన్ స్టోర్ ని ప్రారంభించారు. ఆ తర్వాత రిటైల్ స్టోర్ ప్రారంభం కూడా జరుగుతుందని చెబుతూనే ఉన్నారు. అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి. కానీ, ఇప్పటివరకు అది జరగలేదు. కానీ, అతి త్వరలోనే భారత్ లో యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రారంభానికి అన్నీ ఏర్పాట్లు పూర్తైనట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో స్టోర్ ప్రారంభానికి టిమ్ కుక్ హాజరవుతారని సమాచారం. ఫలానా రోజు ప్రారంభం అని చెప్పకపోయినా.. అతి త్వరలోనే ముంబై స్టోర్ ప్రారంభమవుతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
భారత్ వచ్చిన సందర్భంలో ప్రధాని మోదీని కూడా టిమ్ కుక్ కలుస్తారంటూ ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. టిమ్ కుక్ తో పాటుగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియాన్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. గతంలో 2016లో టిమ్ కుక్ భారత్ వచ్చిన సమయంలో ప్రధానితో భేటీ అయ్యారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ ని కలిశారు. స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ కూడా వీక్షించారు. ఈసారి కూడా ప్రధానితో భేటీ కావడం, ఐపీఎల్ మ్యాచ్ కూడా చూసే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే యాపిల్ ఫోన్ తయారీ కంపెనీ ఫాక్స్ కాన్ తమ యూనిట్లను భారత్ లో ఏర్పాటుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కర్ణాటక, తెలంగాణలో ఫాక్స్ కాన్ సంస్థ తమ తయారీ యూనిట్లను ప్రారంభించనుంది. వీటి ద్వారా 2 లక్షల వంది వరుక ఉపాధి దొరుకుతుంది.
Apple’s FIRST retail store in India is opening soon 🇮🇳‼️
It will be located in Mumbai at the Bandra Kurla Complex (BKC) shopping mall. pic.twitter.com/HDw3hMcsTp
— AppleTrack (@appltrack) April 5, 2023