నేటి కాలంలోని యువత బైక్ లలో ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ను ఇష్టపడుతున్నారు. ప్రత్యేక శబ్దం, ఆకర్షణలో కొత్త హంగులు జోడవ్వడంతో ఆర్ఠికంగా బలంగా ఉన్నవారు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత మార్కెట్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కు భారీ డిమాండ్ ఉందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్ లోకి మరో కొత్త బైక్ ను త్వరలో మార్కెట్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. ప్రత్యేక ఆకర్షణతో, సరికొత్త హంగులతో కూడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ని మార్కెట్ లోకి తీసుకురానున్నామని తాజాగా కంపెనీ ప్రకటించింది.
అయితే ఈ బైక్ కు సంబంధించిన టీజర్ ను ఇటీవల కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఇక ఇది ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుంది? దీని ప్రత్యేకతలేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హంటర్ 350 బైక్ మొత్తానికి సింగిల్ సీట్ తో ఉండనుందని తెలుస్తోంది. ఇది ఇంచుమించుగా మోటర్ 350ని పోలి ఉండనుంది. మరీ ముఖ్యంగా దీని ఇంజిన్ 24.3 Bhp శక్తిని, 32 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ మోటార్ సైకిల్ కోసం ఇంజన్‌ను కొద్దిగా భిన్నంగా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక దీంతో పాటు ముందు భాగంలో పొడవైన విండ్‌స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, స్టాండర్డ్ లగేజ్ ర్యాక్, పెద్ద ఫ్రంట్ వీల్‌కు బదులుగా చిన్న చక్రాలు, తక్కువ సస్పెన్షన్ ట్రావెల్, సింగిల్ సీట్ వంటివి ఉండడం ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. సరికొత్త హంగులతో ఈ బైక్ ను వచ్చే ఏడాది మార్కెట్ లోకి రానుందని సమాచారం. మరి మార్కెట్ లోకి కొత్తగా రాబోతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 న్యూ బైక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.