టెస్లా, ఎలన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు అవసరంలేదు. టెస్లా కార్లు అంటే ప్రపంచంలో ఉన్న క్రేజ్ వేరు. ఎప్పుడూ ప్రజలకు షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇచ్చే మస్క్… తాజాగా టెస్లా ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ డే సందర్భంగా బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. టెస్లా నుంచి హ్యూమనోయిడ్ రోబోలు రాబోతున్నట్లు ప్రకటించారు. అదే రోబో సినిమాలో శంకర్ చూపించారు కదా చిట్టి, ఆ తరహాలోనే హ్యూమనోయిడ్ రోబోను తీసుకురోబోతోంది టెస్లా.
ఎప్పటిలాగానే ఎలన్ మస్క్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఒక రోబోలాంటి మనిషి డ్యాన్స్‌తో కార్యక్రమం ప్రారంభమైంది. అది నిజంకాదు, కానీ మన రోబోకూడా అలానే ఉంటుంది అంటూ మస్క్ చెప్పారు. కార్ల కోసం వాడుతున్న ఆటో పైలట్ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. ఎనిమిది కెమెరాలతో పినిచేసే ఈ ‘న్యూరల్ నెట్‌వర్క్’ మనిషికి ‘ఆర్థిక భారాన్ని’ తగ్గించబోతున్నట్లు మస్క్ వ్యాఖ్యానించారు.
మనుషుల కోసం మనుషులతో తయారు చేయబడుతున్నట్లు చెబుతున్నారు. ఇక స్పెసిఫికిషేన్స్ విషయానికి వస్తే, 5.8 అడుగుల ఎత్తు, 56 కిలోల 699 గ్రాముల బరువుతో లైట్ వెయిట్ మెటీరియల్స్‌తో ఈ రోబోను తయారు చేస్తున్నారంట. గంటకు ఐదు మైళ్ల వేగంతో నడవగలదు. ఈ రోబో 68 కిలోల వరకు బరువును మోయగలదు. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ చూపించేందుకు ఒక స్క్రీన్ కూడా ఉంది. జాయిన్ అవర్ టీమ్ అంటూ మస్క్ ఔత్సాహికులకు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ హ్యూమనోయిడ్ రోబోలు, వచ్చే ఏడాదికల్లా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.