నగదురహిత లావాదేవీల విషయంలో కేంద్రం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే భారతదేశంలో చాలా యూపీఐ పేమెంట్స్ యాప్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో గూగుల్ పేకి మాత్రం మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ యాప్ యూజర్లు సంతోషంలో మునిగి తేలారు. ఎందుకంటే ఒక్కసారిగా వారి ఖాతాల్లో వేలల్లో నగదు జమైంది.
గూగుల్ పే.. ఈ ఆన్ లైన్ పేమెంట్స్ యాప్ గురించి దాదాపుగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు బాగా తిలిసే ఉంటుంది. 2020లో ఈ పేమెంట్స్ మొబైల్ యాప్ ని పరిచయం చేసిన తర్వాత నుంచి మంచి క్రేజ్ వచ్చింది. ఇదే సమయంలో కేంద్రం కూడా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గూగుల్ పే యాప్ కి అంత ఆదరణ లభించడానికి ముఖ్య కారణం స్క్రాచ్ కార్డ్. అవును మీరు రూ.10 సెండ్ చేసినా కూడా స్క్రాచ్ కార్డ్ కి రూ.100 వరకు క్యాష్ బ్యాక్ వచ్చేది. ఇలాంటి ఆఫర్ తో వినియోగదారుల్లోకి దూసుకుపోయింది. ఇప్పుడే అదే స్క్రాచ్ కార్డ్ విధానం గూగుల్ పేకి భారీగా నష్టం వాటిల్లేలా చేసింది.
గూగుల్ పే అనగానే అందరికీ స్క్రాచ్ కార్డులే గుర్తొస్తాయి. అప్పట్లో ఈ స్క్రాచ్ కార్డుల కోసం పెద్ద పెద్ద యుద్ధాలే చేశారు. మొదట్లో రూపాయి నుంచి రూ.999 వరకు మనీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. ఆ తర్వాత ఫోన్ పే తరహాలో రెడీమ్ కూపన్స్ ఇవ్వడం ప్రారంభించారు. మళ్లీ ఇప్పుడిప్పుడు మనీని స్క్రాచ్ కార్డ్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ విధానం గూగుల్ పే కొంప ముంచింది. కొందరు యూజర్ల అకౌంట్లలో రూ.వేలల్లో నగదు జమైంది. 10 డాలర్లు మొదలు వెయ్యి డాలర్ల వరకు జమ కావడం నెట్టింట వైరల్ అయ్యింది. కొందరు యూజర్లు తమకు గూగుల్ పే నుంచి ఇంత మొత్తం నగదు వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Uhhh, Google Pay seems to just be randomly giving users free money right now.
I just opened Google Pay and saw that I have $46 in “rewards” that I got “for dogfooding the Google Pay Remittance experience.”
What. pic.twitter.com/Epe08Tpsk2
— Mishaal Rahman (@MishaalRahman) April 5, 2023
మిషల్ రహ్మాన్ అనే జర్నలిస్ట్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు. మొదట తనకు గూగుల్ పే నుంచి 46 డాలర్లు జమైనట్లు వెల్లడించారు. ఆ తర్వాత మరో యూజర్ కి ఏకంగా 1047 డాలర్లు జమవ్వడం నెట్టింట హల్ చల్ చేసింది. అయితే విషయం కనుగొన్న గూగుల్ పే ఆ మొత్తాలను వెనక్కి తీసుకుంది. ఎవరికైతే నగదు జమైందో వారికి ఒక ఈమెయిల్ పంపారు. సాంకేతిక లోపం వల్ల నగదు జమైందని.. వాటిని తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు గూగుల్ పే వెల్లడించింది. యూజర్లకు గరిష్టంగా రూ.80 వేల వరకు జమకావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మళ్లీ తిరిగి తీసుకున్నారని తెలిసి యూజర్లు నిరాశ చెందారు. మీకు డబ్బు జమైన తర్వాత గనుక వాటిని వేరే ఖాతాకి సెండ్ చేసుకుని ఉంటే ఆ డబ్బు తిరిగి తీసుకునేవాళ్లు కాదు. ఆ ఈమెయిల్ లో కూడా అదే ఉంది. చాలా మందికి అది తెలియక వచ్చిన నగదును కోల్పోయామని బాధ పడ్డారు. గూగుల్ పే నుంచి ఇలా పొరపాటున డబ్బు జమ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Google Pay has taken the money back and has sent an email confirming that the money was deposited in my account by error. pic.twitter.com/8RljrpJVyo
— Mishaal Rahman (@MishaalRahman) April 6, 2023