ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో రోబోలు ఉన్నాయి. మానవ జీవితాన్ని సులభతరం చేసేందుకు ఇప్పటికే ఎన్నో రోబోలను తయారు చేశారు. తాజాగా విద్యార్థులు తయారు చేసిన రోబో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ రోబో ఒక రిక్షావాలా కాబట్టి. అవును ఈ రోబో రిక్షాని లాగేయగలదు.
సొంత బైకులు, కార్లు ఉన్న వారి సంగతి పక్కన పెడితే.. నిద్రలేచిన దగ్గరి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా మీకు ఒక ప్రయాణ సాధనం కావాలి. ఎలాంటి ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లేకుండా మన పనులు జరగడం కష్టం. అయితే నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే ఆర్టీసీతో పాటుగా.. పలు సంస్థల ద్వారా బైకులు, క్యాబులు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొన్నిసార్లు అవి బాగా ఖరీదుగా అనిపిస్తాయి. మరోవైపు వాటి ద్వారా ఎంతో మంది ఉపాధి కూడా పొందుతున్నారు. ప్రయాణికులకు మాత్రం వాటి ఛార్జెస్ విషయంలో మాత్రం ఎప్పుడూ అసహనం ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు క్యాబులకు రీప్లేస్మెంట్ దొరికింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
క్యాబులకు రీప్లేస్మెంట్ కి ఒక రోబో రిక్షా వస్తోందని మీకు తెలుసా? అవునండి.. ఒక రోబో రిక్షా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనిషి కూర్చోబెట్టుకుని అది రిక్షా లాక్కెళుతుంటే నెటిజన్స్ అంతా నోరెళ్లబెటుకుని చూసేస్తున్నారు. ఈ రోబో రిక్షాని తయారు చేసింది నలుగురు విద్యార్థులు. సూరత్ కి చెందిన నలుగురు విద్యార్థులు ఈ రోబో రిక్షాని తయారు చేశారు. ఈ రోబోని నలుగురు విద్యార్థులు 25 రోజులు శ్రమించి తయారు చేశారు. ఈ రోబో రిక్షా తయారు చేసేందుకు వారికి రూ.30 వేలు ఖర్చు అయ్యిందని వెల్లడించారు. దానిని ఇంకా డెవలప్ చేయాల్సింది ఉందంటూ చెబుతున్నారు. ఇది బ్యాటరీ రీఛార్జ్ సాయంతో నడుస్తుంది.
చూడటానికి అచ్చు మనిషిలాగానే నడుస్తుంది. దానికి ఒక రిక్షాని అటాచ్ చేస్తే మనిషిని కూర్చోబెట్టుకుని కూడా లాక్కెళుతుంది. తాము ఇప్పటికే పలు రంగాల్లో సహాయ పడే రోబోలను తయారు చేసినట్లు విద్యార్థులు వెల్లడించారు. ఈ రోబో రిక్షాని మొదటిసారి ప్రయోగాత్మకంగా రోడ్డుపైకి తీసుకురాగా.. అందుకు సంబధించిన వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు ఇలాంటి ఒక రిక్షా ప్రయాణ సాధనంగా అందుబాటులోకి రావాలంటూ డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఇవి గనుక ప్రయాణ సాధనాలు అయతే క్యాబుల పరిస్థితి ముగిసిపోతుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రోబోకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దానిని నిజంగానే మార్కెట్ లోకి తీసుకొస్తారా? లేదా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Robotic rickshaw. A team of four students from Surat has designed a robot, which can walk like a human being and even pull a rickshaw. #EIIRInteresting #engineering #innovation #India
Credit: PTI, NDTV
found via @seshu1709 pic.twitter.com/GZZpme9kaS— Pareekh Jain (@pareekhjain) April 12, 2023