వీడియో కంటెంట్ క్రియేటింగ్ యాప్స్ కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే డబ్ స్మాష్ అనే యాప్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఆ డబ్ స్మాష్‌తో ఎంతో మంది స్టార్లు అయిపోయారు. అయితే డబ్ స్మాష్ తర్వాత టిక్ టాక్ యాప్ బాగా వైరల్ అయ్యింది. టిక్ టాక్ ద్వారా స్టార్లు అయిన వాళ్లు.. ఇప్పటికీ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. అయితే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఆ తర్వాత అందరూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం మొదలు పెట్టారు. వీటన్నింటితో పోటీ పడుతూ స్నాప్ చాట్ కూడా బాగా పాపులర్ అయ్యింది. నిజానికి ఈ అన్ని యాప్స్ కంటే స్నాప్ చాట్‌లోనే ఎక్కువ ఫీచర్లు ఉండటంతో యూజర్లు కూడా ఊరికే అట్రాక్ట్ అయిపోతున్నారు.
ఇప్పుడు స్నాప్ చాట్ యూజర్లకు ముఖ్యంగా ఇండియాలో ఉన్న సౌండ్ క్రియేటర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. అది కూడా వేయి రెండు వేలు కాదు.. లక్షల్లో డబ్బు సంపాదించేందుకు అవకాశం కల్పిస్తోంది. మీలో ఉన్న టాలెంట్‌ని చూపిస్తూ.. మీరు ఒక టాప్ క్రియేటర్ కాగలిగితే లక్షలు గెలుచుకనే అవకాశం మీకు సొంతం అవుతుంది. అయితే అసలు స్నాప్ చాట్‌తో ఎలా లక్షలు వస్తాయి? అందుకు మీరు ఏం చేయాలి? వంటి అంశాలను తెలుసుకుందాం. స్నాప్ చాట్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్.. ‘స్నాప్ చాట్ సౌండ్స్ క్రియేటర్ ఫండ్’ని ఇండియాలో ప్రారంభించనుంది. దీని ద్వారా నెలకు 50,000 డాలర్లు(40,82,000) గ్రాంట్‌గా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
నవంబర్ మధ్య నెల నుంచి ఈ గ్రాంట్‌ను విడుదల చేయనుంది. ఈ 50 వేల డాలర్లను భారత్‌లో ఉన్న అత్యధిక ఆదరణ కలిగిన, టాప్ సౌండ్ క్రియేటర్లకు అందజేయనున్నారు. టాప్ 20 క్రియేటర్లను సెలక్ట్ చేసి వారికి నెలకు 2,500 డాలర్లు అందిస్తారు. ఏ నెల ఎవరు టాప్ 20లో ఉంటే ఆ నెల వారికి గ్రాంట్ అందుకునే అవకాశం ఉంటుంది. 16 ఏళ్లు పైబడిన భారతీయ క్రియేటర్లు ఈ గ్రాంట్‌ను అందుకునేందుకు అర్హులు. ఈ గ్రాంట్ గురించి స్నాప్ సంస్థ మార్కెటింగ్ లీడ్ మాట్లాడుతూ.. “భారతదేశంలో ఉన్న టాలెంటెడ్, ఇండిపెండెంట్ ఆర్టిస్టులకు ఈ గ్రాంట్ ద్వారా సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. వాళ్లు వారి కెరీర్‌లో ఎదిగేందుకు తోడ్పడుతామని భావిస్తున్నాం” అంటూ లక్ష్య మలు వ్యాఖ్యానించారు.
ఇలా మ్యూజిక్‌తో వీడియోలు క్రియేట్ చేయడం ప్రారంభించిన దగ్గరి నుంచి స్నాప్ చాట్‌లో 2.7 బిలియన్ వీడియోలు క్రియేట్ చేశారు. వాటికి 183 బిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే చాలా మందికి ఈ స్నాప్ చాట్ గురించి ఇంకా తెలియకపోవచ్చు. స్నాప్ చాట్‌లో మీకు చాలా ఫీచర్లు ఉంటాయి. వాటిలో స్నాప్ అనేది ఒకటి. అంటే మీరు మీ లైఫ్‌లో ఒక మూమెంట్‌ని స్నాప్ గా తీసుకోవచ్చు. దానిని మీరు మీ మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. వాళ్లు దానిని వ్యూ చేశాక అది డిసప్పియర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ తో చాట్ చేయచ్చు. అది కూడా అదిరిపోయే స్టిక్కర్లు, ఏమోజీలతో మెసేజులు పంపచ్చు. ఇందులో వీడియో తీసేందుకు చాలా లెన్సెస్ అందుబాటులో ఉంటాయి.
Mumbai: Snap, the parent company of Snapchat, on Tuesday said it will provide monthly grants of up to $50,000, beginning mid-November, to top sound creators in India that are distributing music on Snapchat. Snap has partnered with DistroKid, an independent digital music distribut pic.twitter.com/sUMQPnL9nW
— Deccan News (@Deccan_Cable) November 8, 2022
ఇన్‌స్టాగ్రామ్ తరహాలోనే ఇందులో కూడా స్టోరీస్ పెట్టుకోవచ్చు. మీ డేలో మీకు నచ్చిన కోట్, పిక్, వీడియో ఇలా అన్నింటిని స్టోరీ పెట్టుకోవచ్చు. స్పాట్‌లైట్ అని ఇంకో ఫీచర్ ఉంటుంది. రీల్స్ చూసిన తరహాలోనే మీరు బెస్ట్ స్నాప్‌లను చూడచ్చు. అలాగే వాటిని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ కూడా చేయచ్చు. వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్ ఫీచర్లు కూడా స్నాప్ చాట్‌లో ఉన్నాయి. అలాగే స్నాప్ చాట్‌లో వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీ దగ్గర్లో ఉన్న ఫ్రెండ్స్ ని మ్యాప్ అనే ఫీచర్ ద్వారా గుర్తించవచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. మరి.. క్రియేటర్ అయ్యి ఫేమస్ అవుదామనుకుంటున్నారా? అలాగే స్నాప్ గ్రాంట్ ని పొందగలను అనే నమ్మకం ఉందా? అయితే మరి స్నాప్స్ చేయడం షురూ చేసేయండి.
Snap, the parent company of #Snapchat, said it will provide monthly grants of up to $50,000, beginning mid-November, to top sound creators in #India that are distributing music on Snapchat.@Snap pic.twitter.com/QC3gg4Mohr
— Atulkrishan (@iAtulKrishan) November 8, 2022