సాధారణంగా అందరూ కారు కొనే సమయంలో మైలేజ్, డిస్కౌంట్స్, ధర గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. కానీ, ఎవరూ కూడా కారు సేఫ్టీ గురించి పరిగణలోకి తీసుకోరు. కానీ, మీరు ప్రధానంగా పరిగణించాల్సిన అంశమే సేఫ్టీ. మీరు కొనే కారు ఎంత భద్రతను ఇస్తుందో మీరు తెలుసుకోవాలి.
స్కోడా కారు అనగానే ప్రీమియం, లగ్జరీ కారు అని అందరికీ తెలుసు. చాలా బ్రాండులతో పోల్చుకుంటే తక్కువ ధరలోనే ఎంతో లగ్జరీగా ఉంటుంది. ఈ కారు నుంచి లగ్జరీ మాత్రమే కాదు.. అత్యుత్తమ సేఫ్టీ కూడా లభిస్తోంది. తాజాగా ఆ సంస్థ తమ కారు మోడల్ కు దక్కిన స్టార్ రేటింగ్ గురించి ప్రకటించింది. స్కోడా స్లావియా మోడల్ కు క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ లభించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న కార్లలో అత్యుత్తమ రేటింగ్స్ లభించాయంటూ ఆ సంస్థ తెలియజేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా కారు కొనే సమయంలో సేఫ్టీని ప్రధానంగా చూసుకోవాలి. ఇప్పుడు స్కోడా కంపెనీకి చెందిన స్లావియా మోడల్ సెడాన్ కారు అత్యంత భద్రత కలిగినదిగా ప్రకటించబడింది. ఇటీవల యూరప్ లో జరిగిన గ్లోబల్ న్యూ కార్ అసస్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా స్కోడా స్లావియా కారుకు క్రాష్ టెస్టు నిర్వహించారు. అందులో అద్భుతమైన రేటింగ్స్ లభించాయి. పెద్దలకి మాత్రమే కాకుండా పిల్లలకు కూడా ఈ కారు ఎంతో సేఫ్టీ అని తేలింది. పెద్దలకు గరిష్టంగా 34 సేఫ్టీ పాయింట్లు కాగా 29.71 పాయింట్లు సొంతం చేసుకుంది. అంటే 5 స్టార్ రేటింగ్ తో సమానం అనమాట. ఆ విషయాన్ని స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్ర్ సోల్క్ వెల్లడించారు.
ఇంక ఈ స్కోడా స్లావియా సెడాన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కారు పెట్రోల్ వర్షన్ లో వస్తోంది. దీనిలో మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ స్కోడా స్లావియా 1498 సీసీతో వస్తోంది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు, మల్టీ-కొలిజియన్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్- ప్రెజర్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, చైల్ట్ సీటింగ్ కోసం మౌంట్స్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్, 521 లీటర్స్ బూట్ స్పేస్, 5 సీటింగ్ కెపాసిటీ, 7 స్పీడ్ డీఎస్జీ గేర్ బాక్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ వెదర్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్కోడా స్లావియా ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ రూ.11.39 లక్షల నుంచి హైఎండ్ రూ.18.45 లక్షల వరకు ఉంది.