విద్యుత్ వాహనం అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. భారత మార్కెట్ లో కూడా ఈవీలకు డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేయాలి అనే ప్రశ్న కూడా చాలామంది నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు మీకోసం ఒక స్టైలిష్ బడ్జెట్ ఈవీని తీసుకొచ్చాం.
ఎలక్ట్రిక్ వెహికిల్స్ కి క్రేజ్ తో పాటుగా డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు విద్యుత్ వాహనాల మార్కెట్ బాగా పెరిగింది. ముఖ్యంగా కొత్తగా టూవీలర్ కొంటుంటే ఈవీలకే మొగ్గు చూపుతున్నారు. అందుకు కారణం వాటి మెయిన్టినెన్స్ తక్కువ. పైగా ప్రభుత్వాలు ఈవీలకు ఎక్కువ రాయితీలు ఇస్తున్నాయి. ఇవి వన్ టైమ్ ఇన్వెస్టిమెంట్ కోవకు చెందుతాయి. రోజుకి కేవలం రూ.5 ఖర్చుతో మీరు ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి సింపుల్ వన్ అనే ఈవీ సంస్థ చేరింది. మరి.. ఆ స్కూటీ ప్రత్యేకత ఏంటి? ఎందుకు కొనుగోలు చేయాలో చూద్దాం.
సింపుల్ వన్ అనే ఎలక్ట్రిక్ స్కూటీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్కూటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. భారతీయులతో- భారత్ లో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీ. లుక్స్ పరంగా ఈ సింపుల్ వన్ స్కూటీ అందరికీ తెగ నచ్చేస్తోంది. వైట్, బ్లాక్, రెడ్, బ్లూ అంటూ 4 స్టన్నింగ్ కలర్స్ లో ఈ స్కూటీ వస్తోంది. ఇందులో ఫీచర్స్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సింపుల్ వన్ స్కూటీలో డాష్ బోర్డు లుక్స్ చాలా బాగున్నాయి. ఇందులో మీరు వెళ్లాల్సిన డెస్టినేషన్ ని యాడ్ చేసుకుని డిస్ ప్లేలోల చూస్తూ వెళ్లచు. ఫోన్ తీసి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్కూటీకి మీ వన్ యాప్ ద్వారా మీ మొబైల్ ని పెయిర్ చేసుకోవచ్చు.
దానిద్వారా మీకు వచ్చే కాల్స్ ని ఆన్సర్ చేయడం, రిజెక్ట్ చేయడం చేయవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్ లో ఉండే మ్యూజిక్ యాప్స్ ని సింపుల్ వన్ స్కూటీ ద్వారానే మీరు కంట్రోల్ చేయచ్చు. దీనిలో మీకు రిమోట్ యాక్సెస్ ఉంటుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ రెండు ఫోన్లకు కంపాటబుల్ గా వీళ్లు త్వరలోనే యాప్ రిలీజ్ చేయనున్నారు. దాని ద్వారా మీరు స్కూటీని రిమోట్ లాక్ చేయవచ్చు. జియో ఫెన్సింగ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీ ప్రయాణాలను కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలీ మీటర్ల రేంజ్ తో వస్తోంది. బ్యాటరీ, ఛార్జర్, వెహికిల్ పై మూడేళ్ల వారెంటీ లభిస్తుంది. దీని ధర రూ.1.09 నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటీని రూ.1947తోనే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.