చాలా మంది కారు కొన్న తర్వాత చాలా రిలాక్స్ అయిపోతారు. ఆ కారు విషయంలో కాస్త నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తుంటారు. కానీ, కారు కొన్న తర్వాతే ఎంతో బాధ్యతగా ఉండాలి. కారుకి టైమ్ టూ టైమ్ సర్వీసింగ్ చేయించాలి. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ట్రైన్డ్ టెక్నీషియన్స్ కి మాత్రమే చూపించాలి.
కారు కొనడంతోనే పని పూర్తికాదు. అసలు పని అక్కడి నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత దానిని ఎప్పటికప్పుడు మెయిన్ టైన్ చేయాలి. ముఖ్యంగా కారుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి. అయితే చాలా మంది ఈ సర్వీసింగ్ విషయంలో చాలా లైట్ తీసుకుంటారు. ఇంకో 2 వేల కిలోమీటర్ల తర్వాత చేయిద్దాం. ఇంకో నెల తర్వాత సర్వీసింగ్ చేయిద్దాం అంటూ చెబుతుంటారు. పైగా నెల రోజుల్లో ఏమై పోతుంది? అని తిరిగి ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు. అయితే వాళ్లు ఈ విషయాన్ని క్లియర్ గా తెలుసుకోవాలి. అదేంటంటే.. కారుని టైమ్ కి సర్వీసింగ్ చేయించకపోతే మీరు బాగా నష్టపోతారు. అందులో ఎలాంటి సందేహాన్ని పెట్టుకోకండి.
మీరు కారుని ఎప్పటి కప్పుడు సర్వీసింగ్ చేయించాలి. అందులో ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ ని ఛేంజ్ చేయిస్తూ ఉండాలి. ఆ విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఇంజిన్ లైఫ్ తగ్గిపోతుంది. ఇంజిన్ లో ఉండే ఆయిల్.. బాగా థిక్ గా మారిపోతూ ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయేలా చేస్తుంది. ఆయిల్ స్లడ్జ్ వల్ల ఇంజిన్ పట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఇంజిన్ ని క్లీన్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ ప్రమాదమే జరగచ్చు.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ కారు మైలేజ్ గణనీయంగా తగ్గిపోతుంది. మీరు సర్వీసింగ్ విషయంలో చూపించే నిర్లక్ష్యం తిరిగి మీ పర్స్ మీదే పడుతుంది. ఖర్చు అవుతుందని సర్వీసింగ్ చేయించకపోతే తర్వాత మైలేజ్ తగ్గిపోయి ఇంకా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే మీరు టైమ్ టూ టైమ్ సర్వీసింగ్ చేయిస్తూ ఉంటే.. ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. అలాగే మీ కారు మంచి మైలేజ్ ని కూడా ఇస్తుంది. నిజానికి కంపెనీ ఎంత మైలేజ్ చెప్పినా కూడా సరైన సర్వీసింగ్ లేకపోతే మైలేజ్ రావడం కష్టం.
సరైన సమయానికి మీరు సర్వీసింగ్ చేయించక పోవడం వల్ల మీ కారు లైఫ్ తగ్గిపోతుంది. మొత్తానికి కొన్ని నెలలకు మీరు కారు నడవడం మానేస్తుంది. మొత్తానికే మొరాయిస్తుంటుంది. సర్వీసింగ్ అంటే కేవలం ఇంజిన్ మార్చడం మాత్రమే కాదు. బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్యాటరీ వాటర్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ ఇలా చాలా చెక్ చేస్తారు. వాటిలో ఏది మంచిగా లేకపోయినా మార్చాల్సిందిగా సూచిస్తారు. మీరు సర్వీసింగ్ ని లైట్ తీసుకుంటే అవన్నీ కలిసి మీ కారు లైఫ్ ని అమాంతం తగ్గిచ్చేస్తాయి.
సాధారణంగా మీ కారుని అమ్మాలి అనుకుంటే సరైన సర్వీసింగ్ చేయని కార్లకు మంచి రేటు ఉండదు. ఈ మధ్య కాలంలో అందరూ కారు కండిషన్ ముందే పరిశీలించి కొనుగోలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన సాఫ్ట్ వేర్లు కూడా ఉన్నాయి. పైగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు చాలా కంపెనీలు కూడా ఉన్నాయి. వారు మీ కారుని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధర నిర్ణయిస్తారు. సరైన కండిషన్ లేకపోతే చాలా తక్కువ ధరకు అడుగుతారు. కొన్ని సందర్భాల్లో అసలు కొంటారు అనే నమ్మకం కూడా ఉండదు.
సరైన సర్వీసింగ్ చేయని కారులో ప్రయాణిస్తున్నారు అంటే మీ ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నట్లే. ఎందుకంటే అలాంటి కార్లు ఎప్పుడు హ్యాండిస్తాయో చెప్పలేం. సర్వీసింగ్ సరిగ్గా లేకపోతే.. బ్రేకులు ఫెయిల్ కావచ్చు, ఇంజిన్ మొరాయించవచ్చు, మీరు హడావుడిగా వెళ్తుంటే నడి రోడ్డు మీద ఆగిపోవచ్చు. అందుకే కారుని టైమ్ కి సర్వీసింగ్ చేయించండి. పైగా సర్వీసింగ్ స్కిప్ చేస్తే కొత్త కార్లకు అయితే వారెంటీ కూడా పని చేయడు. కంపెనీ నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా ఉండదు. అలాంటప్పుడు మీరు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కారుని సర్వీస్ చేయించండి. అలా చేస్తే డబ్బు ఆదా అవ్వడమే కాకుండా.. ప్రాణాలు కూడా క్షేమంగా ఉంటాయి.