ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాష్ యాప్ కి కూడా ఎంతో మంది యూజర్లు ఉన్నారు. ఈ రెండింటికి సంబంధించిన టెక్ దిగ్గజం బాబ్ లీ దారుణంగా హత్య చేయబడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు బాబ్ లీపై కత్తులతో దాడికి దిగారు.
ఇప్పుడు ఆండ్రాయిడ్, క్యాష్ యాప్స్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఒక పేరు మాత్రం తప్పకుండా తలుచుకోవాలి. అదే టెక్ దిగ్గజం బాబ్ లీ పేరు. ఆండ్రాయిడ్ సృష్టికర్త, క్యాష్ యాప్ ఫౌండర్ బాబ్ లీ దారుణ హత్యకు గురయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గుర్తుతెలియని కొందరు బాబ్ లీపై కత్తితో దాడికి తెగబడ్డారు. బాబ్ లీని దుండగులు కత్తితో పొడిచినట్లు మంగళవారం ఉందయం 2.35 గంటల మసయంలో సమాచారం వచ్చింది. ఎవరో గుర్తుతెలియని వాళ్లు పోలీసులు ఈ సమాచారం అందించారు. పోలీసులు ఫటనాస్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించేలోపే.. బాబ్ లీ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.ఈ విషయంపై ఫాక్స్ న్యూస్ కథనం ప్రచురించింది. బాబ్ లీ హత్య ఘటనలో శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ఎవరి పేర్లు అనుమానితులుగా విడుదల చేయలేదు.
అంతేకాకుండా ఎవరినీ అరెస్టు కూడా చేయలేదని న్యూయార్క్ పోస్ట్ తెలియజేసింది. బాబ్ లీ మరణ వార్త తెలుసుకుని క్యాష్ యాప్ ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సీఈవో ఎంతో గొప్ప వ్యక్తని.. అలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణం అంటూ విచారం వ్యక్తం చేశారు. ఈయన ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సేతో కూడా కలిసి పనిచేశాడు. గూగుల్ కి చెందిన ఆండ్రాయిడ్ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారు. జాక్ డోర్సే స్థాపించిన స్కైర్ సంస్థకు 2010లో బాబ్ లీ సీఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత క్యాష్ యాప్ ని ప్రారంభించారు. టెక్ రంగంలో బాబ్ లీకి ఎంతో మంచి పేరుంది. ఈయనను ‘క్రేజీ బాబ్’ అంటూ పిలుస్తుంటారు. బాబ్ లీ మరణంతో టెక్ రంగం విచారం వ్యక్తం చేస్తోంది.
Cash App founder Bob Lee, 43, stabbed to de@th in the US. pic.twitter.com/WSlDboRyrG
— YabaLeftOnline (@yabaleftonline) April 5, 2023