ఫ్రెషర్స్, నిరుద్యోగుల్లో చాలా మంది ఐటీ రంగంలో ఉద్యోగం పొందాలనేది కల అంటారు. అలాగే వారు కోరుకున్నట్లు పెద్ద పెద్ద కార్పొరేట్, ఐటీ సంస్థల్లో ఉద్యోగం పొంద గలిగితే వారికన్నా అదృష్టవంతులు లేరని ఫీలవుతుంటారు. కానీ, ఇప్పుడు చాలా మందికి ఆ అదృష్టం లేకుండా పోతోంది. ఎందుకంటే విప్రో, ఇఫోసిస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ కి ఆఫర్ లెటర్ ఇచ్చినట్లే ఇచ్చి కొంతకాలం తర్వాత మీ జాయిన్ ఆఫర్‌ని రద్దు చేస్తున్నాం అంటూ మెయిల్స్ పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఫ్రెషర్స్ మాత్రమే కాదు.. అభ్యర్థి స్కిల్స్ సరిపోలేదని భావించినా, ఫేక్ ఎక్స్ పీరియన్స్ అని తెలిసినా వెను వెంటనే వారిని ఇంటికి పంపేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అసలు అందుకు గల కారణాలు ఏంటనేది చూద్దాం.
ఫ్రెషర్స్ కి పలు రౌండ్లలో ఇంటర్వూ నిర్వహించి.. తర్వాత కొద్దిరోజులు వెయిట్ చేయించి ఆ తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చి.. నాలుగు నెలల తర్వాత మీ ఆఫర్ రద్దు చేయబడింది అంటూ మెయిల్స్ పంపుతున్నట్లు విమర్శలు వినిపించడమే కాదు.. కేసులు కూడా వస్తున్నాయి. ‘మీ క్వాలిఫికేషన్ మా అవసరాలకు తగినట్లు లేదు” అంటూ ఈమెయిల్స్ వస్తున్నట్లు వాపోతున్నారు. ఐటీ కంపెనీల తీరుతో ఫ్రెషర్స్ అయోమయంలో పడిపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు బిజినెస్ లైన్ వెల్లడించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకు గల కారణం ఏంటని అంతా తలలు పట్టుకుంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యమే ఇలా ఐటీ కంపెనీలు ఆఫర్లను వెనక్కి తీసుకోవడానికి కారణంగా చెబుతున్నారు.
ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలపై పడుతున్న భారాలను తగ్గించుకునేందుకే ఐటీ కంపెనీలు సహా పలు ఎంఎన్‌సీ కంపెనీలు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇక్కడితే ఆగే పరిస్థితి లేకపోగా.. ఇంకా తీవ్రతరం కానున్నట్లు ఐటీ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇటీవలే టీసీఎస్ కంపెనీ సైతం ఉద్యోగులకు చెల్లించే వేరియబుల్ పేని సైతం తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ పేలో ఇన్ఫోసిస్ 70శాతం కోతపెట్టగా.. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఐటీ రంగంలో మూన్‌లైట్ అనే మాట బాగా వినిపిస్తోంది. ఆర్థికమాంద్యం కారణంగా భారాన్ని తగ్గించుకోవడానికి మూన్‌లైట్ అనే అంశాన్ని కారణంగా చూపుతు విప్రో ఏకంగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఆగస్టులో ఐటీ రంగంలో 10 శాతం మేర రిక్రూట్‌మెంట్లు తగ్గినట్లు రిపోర్టులు కూడా చెబుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే ఐటీ రంగంలో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Firms like #Wipro, #Infosys & #TechMahindra have reportedly revoked offer letters given to students after delaying their joinings by nearly 3-4 months.
Many were given offer letters but first the joining of the candidates was postponed & finally, their offer letter was revoked. pic.twitter.com/4MrWBIOqSJ
— Mirror Now (@MirrorNow) October 4, 2022