ప్రస్తుతమున్న సోషల్ మీడియా యాప్‌లలో అత్యంత లోక ప్రియమైన, జనాదరణ కలిగిన వాటిలో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.3 బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు. వీరిలో దాదాపు 500 మిలియన్ల మంది యూజర్లు రోజూ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారు. తమ అభిరుచులను, ఆట పాటలను, అభిప్రాయాలను.. ఫోటోలు, వీడియోల రూపంలో వ్యక్తపరుచుకోవడం దీని ప్రత్యేకత. అలా అని ఇన్‌స్టాగ్రామ్.. టైం పాస్, ఎంటర్టైన్మెంట్ హబ్ అనుకోకండి. ఆదాయం ఆర్జించి పెట్టే మంచి వనరుగా కూడాను. ఎంతోమంది ఇన్‌స్టా యూజర్స్ ఇలా ఆదాయాన్ని గడిస్తున్నారు. అయితే ఇందుకు ఉండాల్సిన అర్హతలు ..ఆకర్షణీయమైన కంటెంట్, పెద్దఎత్తున ఫాలోయర్స్. ఇవి ఉన్నవాళ్లు ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లుగా మారి కాసుల వర్షం కురిపిస్తున్నారు. అయితే, తాజాగా ఇన్‌స్టా ‘టిక్’ మార్కులకు సంబంధించి పిడుగులాంటి వార్త అందుతోంది.
‘ట్విట్టర్’ లాగానే ఇన్‌స్టాలోనూ కూడా ప్రముఖ వ్యక్తుల ప్రోఫైల్ కు బ్లూ టిక్ గుర్తు ఉంటుంది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తరువాత, టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం పలు దేశాల్లో యూజర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) కోసం ట్విట్టర్ వినియోగదారులు నెలకు $8 చెల్లిస్తున్నారు. ఈ పేయిడ్ వెరిఫికేషన్ ద్వారా ప్రముఖులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా ఈ బ్లూ టిక్ ని కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. టిక్ మార్కు విషయంలో మెటా యాజమాన్యం కూడా ట్విట్టర్ దారినే నడవనున్నట్టు అనుసరించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Blue Tick: #Instagram set to follow Twitter’s lead and charge for verified status!
Read More: https://t.co/RFvBni8GyY pic.twitter.com/G5CWT5znnS
— TIMES NOW (@TimesNow) February 3, 2023
ఎకౌంట్ ప్రొఫైల్ వెరిఫికేషన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి, టెక్ దిగ్గజం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మెటా టెక్ దిగ్గజం ట్విట్టర్ ని అనుసరిస్తే.. ఈ పెయిడ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇన్‌స్టాగ్రామ్ & ఫేస్‌బుక్ రెండింటికి వర్తిస్తుందా? లేదా? అన్నదానిపై కూడా స్పష్టత ఇవ్వాలి. ఇక మున్ముందు సదరు ప్లాట్ ఫామ్ లను వాడుతున్నందుకు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుందేమో అన్న కామెంట్లు వినపడుతున్నాయి. ఇలా ఒక ‘టిక్’ మార్క్ కోసం డబ్బులు చెల్లించమనడం సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.