సాధారణంగా ఫోన్ నుంచి డబ్బులు పంపించాలంటే అది కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారానే సాధ్యం. దానికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటేనే సాధ్యం అవుతుంది. కానీ.. మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ల సంఖ్య కంటే ఫీచర్ ఫోన్ వాడే కస్టమర్ల సంఖ్యే ఎక్కువ. దాదాపు 40 కోట్ల మంది భారతీయులు ఫీచర్ ఫోన్ వాడుతున్నారు. అటువంటి వాళ్లు కూడా తమ ఫోన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుగా ఆర్బీఐ ఓ యాప్ ని తీసుకువచ్చింది. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ యాప్ ని ప్రారంభించారు. 123పే(123Pay) అనే పేరు పెట్టారు.
‘ఇప్పటివరకూ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు దూరంగా ఉన్న అట్టడుగు వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల వారికి వర్గాలకు యూపీఐ 123పే ప్రయోజనకరంగా ఉంటుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని ఫీచర్ ఫోన్లకు యూపీఐ సర్వీసుల ఆవిష్కరణ కార్యక్రమంలో దాస్ చెప్పారు. యూపీఐ ద్వారా ఈ సర్వీస్‌ను ఉపయోగించి ఫీచర్ ఫోన్ల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్లలో ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా 123పే అనే సర్వీస్‌ను ఉపయోగించి డబ్బులు పంపించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: చనిపోయే 30 సెకెన్ల ముందు మనకు తెలుస్తుందట! అదెలా.. ?కుటుంబ సభ్యులు .. స్నేహితులకు చెల్లింపులు జరిపేందుకు, కరెంటు..నీటి బిల్లులు కట్టేందుకు, వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్‌ల రీచార్జి, మొబైల్ బిల్లుల చెల్లింపులు, ఖాతాల్లో బ్యాలెన్స్‌లను తెలుసుకోవడం మొదలైన అవసరాలకు యూపీఐ 123పే ఉపయోగపడుతుంది. దాని కోసం ఫీచర్ ఫోన్ కస్టమర్లు బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: ఆకట్టుకుంటున్న వింత కారు.. అద్భుతమైన ఫీచర్లు!
ఫీచర్ ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్‌ను వాడే కస్టమర్ల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ సర్వీస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) లాంచ్ చేసింది. డిజిసాతీ పేరుతో ఎన్‌పీసీఐ(NPCI) తీసుకొచ్చిన హెల్ప్‌లైన్ సర్వీస్‌ను వినియోగించుకోవాలనుకునే వాళ్లు.. Digisaathi వెబ్‌సైట్‌లోకి కానీ 14431, 1800 891 3333 కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
The @RBI has launched @UPI_NPCI for feature phones called #UPI123Pay . UPI on feature phones will help people in rural areas who cannot afford a #smartphone.
The name UPI123pay denotes that the UPI payment can be done in three (123) easy steps i.e. 1. Call 2. Choose and 3. Pay. pic.twitter.com/UxTDY2bJPB— Socio Story (@SocioStory) March 10, 2022