దేశవ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థలు మొదలుకొని.. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల వరకు అందరి నోటా వినిపిస్తున్న మాట.. 5జీ. మనిషి జీవన విధానాన్నే సమూలంగా మార్చిగలిగే ఈ అత్యాధునిక నెట్‌వర్క్ పై ఎన్నో అంచనాలున్నాయి. వేలం కూడా ముగియడంతో.. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. తొలుత 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో అందరకి వచ్చే సందేహం..ఏ ఫోన్ కొనాలి?. ఏ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది అన్నది. రేపొద్దున 6జీ వస్తుంది. అప్పుడు ఇంకో ఫోన్ కొనాలా? అలాంటి సందేహాలను నివృత్తి చేసేలా అన్ని విషయాలూ తెలుసుకుందాం..
మీ మొబైల్ 5జీకి సపోర్ట్ చేయాలంటే.. అందుకు సపోర్ట్ చేసే ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉండాలి. అయితే దేశీయంగా 5జీ విప్లవం జోరందుకోవడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తాము తయారు చేసిన ఫోన్‌లలో 5జీ సపోర్ట్ చేసే ఫీచర్స్ ఉన్నాయంటూ కొనుగోలు దారుల్ని నమ్మబలికిస్తుంటాయి. ఈ తరుణంలో కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలి. ఏ మొబైల్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది
అన్న విషయంపై క్లారిటీ వచ్చాక కొనుగోలు చేయడం ఉత్తమం.
ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్ 5జీ కాదా! అన్నది.. ఎలా చెక్ చేయాలో చూద్దాం..
ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే.. ఒకవేల మీరు ఇప్పటికే వాడుతున్నఫోన్ 5జీ నెట్‌వర్క్ కు సపోర్ట్ చేసే ప్రాసెసర్ ఉంటే, మీరు మరొకటి కొనుగోలు చేసే అవసరం ఉండదు. కనుక మొదట మీ మొబైల్ అందుకు సపోర్ట్ చేస్తుందా? లేదా? అన్నది తెలుసుకోవాలి. మొదట సెట్టింగ్‌లోకి వెళ్లి.. అబౌట్ ఫోన్ ఆనే ఆప్షన్ పై ట్యాప్ చేసి ప్రాసెసర్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ ఏంటో తెలుసుకోవచ్చు.ఇప్పుడు.. మీ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ కింద ఇవ్వబడిన లిస్టులో ఉంటే.. మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేసినట్లే అంటున్నారు నిపుణులు.
క్వాల్కమ్:
మీడియా టెక్:
మీడియా టెక్ డైమన్సిటీ 700 నుండి 9000 ప్రాసెసర్ వరకు మాత్రమే 5జీ నెట్‌వర్క్ కు సపోర్ట్ చేస్తాయి. ఇవి కాకుండా మీడియా టెక్ హీలియో సిరీస్‌తో పాటు ఇతర సిరీస్ ప్రాసెసర్‌లు 5జీకి సపోర్ట్ చేయవు.
శాంసంగ్:
ఎక్సినోస్ 9820, ఎక్సినోస్ 9825,ఎక్సినోస్ 990,ఎక్సినోస్2100, ఎక్సినోస్ 2200లు మాత్రమే 5జీకి సపోర్ట్ చేస్తాయి.
ఈ లిస్టులో.. మీ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ ఉందేమో చెక్ చేసుకోండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 5G Network: 5జీ టెక్నాలజీ అంటే లాభాలే కాదు! ఈ నష్టాలు కూడా ఉంటాయి!
ఇదీ చదవండి: 5జీ టెక్నాలజీ రాబోతోంది.. ఈ క్రమంలో 20వేల లోపు లభించే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ మీకోసం..!