సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత మానవ జీవితంలో ప్రతి పని సులువైపోయింది. ఈ రోజు మనకు ఏ సమాచారం కావాలన్నా కూడా అంతర్జాలంలో క్షణాల్లో వెతుక్కునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్య వార్తల్లో సంచలనంగా మారిన అనువర్తనం చాట్ జిపిటి. మరి దీనిని నమ్మి ఓ ప్రొఫెసర్ విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

అమెరికాకు చెందిన ప్రఖ్యాత టెక్సాస్ యూనివర్సిటీలోని విద్యార్థులు ఫైనల్ పరీక్షల్లో భాగంగా వ్యాసాలు సబ్ మిట్ చేశారు. అయితే ఆ ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్ జిపిటిని వినియోగించారు. అయితే ఆ వ్యాసాలను స్కాన్ చేసిన చాట్ జిపిటి విద్యార్థులు కంప్యూటర్ ద్వారా రాశారని చెప్పింది. దీనిని నమ్మిన ఆ ప్రొఫెసర్ ఆ విద్యార్థులందరినీ ఫెయిల్ చేశారు. కానీ ఆ విద్యార్థులు పరీక్షలను దేనిపైన ఆదారపడకుండా సొంతంగానే రాశామని తెలిపారు. ఆ తరువాత చాట్ జిపిటి విశ్లేషన తప్పు అని బయటపడింది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పడంతో పాటు మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాడు.
ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఎఐ రూపొందించిన అధునాతన టెక్నాలజీయే చాట్ జిపిటి. అయితే నిత్యజీవితంలో ముడిపడి ఉన్న అనేక విషయాలను ఈ చాట్ జిపిటి ద్వారా పరిష్కరించుకోవచ్చు. సాఫ్ట్ వేర్ కోడ్ లు, గణిత ప్రశ్నలు, కొత్త పరిశోధక పత్రాలు, వ్యాసాలు రాయడం, ఇలా ఏది అడిగినా లోతుగా విశ్లేషించి సమాధానాలను ఇస్తుంది. కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులను ఈ చాట్ జిపిటి తీసుకురానుంది. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న ఈ చాట్ జిపిటి పూర్తిగా డెవలప్ అయి వాడకంలోకి వచ్చిన తరువాత ఎన్ని మార్పులు తీసుకువస్తుందో చూడాలి.