స్మార్ట్ ఫోన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. అందుకే మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాయి. ఇటీవల కొత్తగా ఫ్లాగ్ షిప్ మొబైల్స్ అని కూడా మార్కెట్ లో వస్తున్నాయి. అయితే అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఒక కంపెనీ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్ మీద భారీగా ధరని తగ్గించింది.
సాధారణంగా అన్ని కంపెనీలు ఫ్లాగ్ షిప్ ఫోన్లను తీసుకొస్తుంటాయి. వాటిలో కొన్ని ఎక్స్ క్లూజివ్ ఫీచర్లను, కలర్ వేరియంట్స్ ని తీసుకొస్తాయి. వీటిని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఆ మోడల్స్ వారిని అందరి నుంచి కాస్త భిన్నగా చూపిస్తాయి. కాకపోతే ఆ ఫ్లాగ్ షిప్ ఫోన్లు కాస్త ఖరీదుగా ఉంటాయి. చాలామంది వాటిని కొనాలి అనుకున్నా ధర చూసి వెనక్కి తగ్గుతుంటారు. కానీ, ఇప్పుడు ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ మీద కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా ఈ మోడల్ ఎమ్మార్పీపై రూ.9 వేలు తగ్గించింది. ప్రస్తుతం ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి కూడా.
ఇప్పుడు చెప్పుకోబోయే ఫ్లాగ్ షిప్ ఫోన్ ఐకూ కంపెనీకి చెందింది. ఆ బ్రాండ్ నుంచి ఐకూ నియో 6 అనే ఫ్లాగ్ షిప్ ఫోన్ మార్కెట్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్ పై కంపెనీ రూ.9 వేలు డిస్కౌంట్ ప్రకటించింది. ప్రముఖ ఇ-కామర్స్ సైట్ లో వీటికి అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐలు కూడా ఉన్నాయి. బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర తగ్గించడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని చెబుతున్నారు. మంగళవారు వన్ ప్లస్ సీఈ3 ఫోన్ భారత్ లో లాంఛ్ అయింది. ఆ ఫోన్ కి పోటీగా ఐకూ కంపెనీ ఈ ఫోన్ ధర తగ్గించినట్లు అభిప్రాయపడుతున్నారు. ఆ ఫోన్ కి పోటీ ఇచ్చేందుకే ఇలా చేశారంటున్నారు.
ఇంక ఐకూ నియో 6 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.4 ఇంచెస్ 120 హెట్స్ ఈ4 ఆమోలెడ్ డిస్ ప్లే, 1300 నిట్స్ పీక్స్ బ్రైట్ నెస్, 360హెట్స్ టచ్ శాంపిలింగ్ రేట్ ఉంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. కేవలం 12 నిమిషాల్లో ఈ ఫోన్ 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెససర్ ఉంది. అంటుటు స్కోర్ 7,40,000 ఉంది. అంటే గేమర్స్ కి ఇది అద్భుతమైన ఫోన్ అనచ్చు. 64 ఎంపీ వోఐఎస్ మెయిన్ కెమెరా, పార్టీ పోట్రైయిట్, లాంగ్ ఎక్స్ పోజ్ మోడ్, సూపర్ నైట్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 8 జీబీ+128 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.34,999కాగా ఇప్పుడు రూ.24,999గా నిర్ణయించారు. 12 జీబీ+ 256 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.39,999 కాగా రూ.28,999కి ప్రైస్ డ్రాప్ చేశారు. ఈ ఐకూ నియో 6 ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.