స్మార్ట్ ఫోన్ వినియోగదారులా మీకో అలర్ట్! ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ ఫోన్లకు పరిమితమైన మనం, ఇకపై మడతపోన్లు చేత పట్టనున్నాం. ఈ మేరకు టెక్ కంపెనీలు వరుసగా మడతఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే.. శాంసంగ్, షావోమి, మోటోరోలా కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా వన్‌ప్లస్ కూడా ‘ఫోల్డబుల్ ఫోన్’ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు ‘పీట్ లా’ అందుకు సంబంధించిన ఫోన్ మెకానిజం ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు.
పీట్ లా షేర్ చేసిన మెకానిజం ప్రకారం.. ఇది రెండు మడతలతో కాకుండా మూడు మడతలతో రానున్నట్లు తెలుస్తోంది. “పోల్డింగ్ ఫోన్ లో మీరు ఎలాంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఫోల్డింగ్ టెక్నాలజీని చేరుకోవడానికి మాకు ఎన్నో ఏళ్ల సమయం పట్టింది. ఈ కొత్త మెకానిజమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు” అని పీట్ లా ట్వీట్ చేశారు. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ.. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ ఫోన్ పనిచేస్తుందట. గతేడాది ఒప్పో, వన్స్ కంపెనీలు విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒప్పో తీసుకొస్తున్న ‘ఫైండ్ ఎన్’ తరహాలోనే దీని ఫీచర్స్ ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు.
This is the Find N’s hinge system 🦾 We spent years ensuring we got the details right (like the virtually crease-free display) to meet our users’ needs.
What do you want from a foldable? 🤔👇 https://t.co/2CM8rbxKMo https://t.co/rDatt3g9ce pic.twitter.com/B63psFlUyl
— Pete Lau (@PeteLau) August 12, 2022
ఒప్పో ఫైండ్ ఎన్ బయటవైపు 5.49 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉంది. ఇక లోపల ఉన్న అన్‌ఫోల్డెడ్ డిస్‌ప్లే సైజు 7.1 అంగుళాలుగా ఉంది. దీని దీని యాస్పెక్ట్ రేషియో 8.4:9, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఎల్టీపీవో టెక్నాలజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండగా, 33వాట్ సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 15W వైర్‌లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.ఇక.. కెమెరా విషయానికొస్తే.. ఇందులో మొత్తంగా ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనకవైపు మూడు కెమెరాలు(50ఎంపీ +16ఎంపీ +13ఎంపీ)గా ఉండనున్నాయి. ఇక అవుటర్ స్క్రీన్ వైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత కస్టం సాఫ్ట్‌వేర్‌పై ఒప్పో ఫైండ్ ఎన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fold, unfold
Fold, unfold
Fold, unfold#OPPOFindN #OPPOINNO pic.twitter.com/LTZpdsoF90— OPPO (@oppo) January 29, 2022
ఇదీ చదవండి: ఇకపై కెమెరా అవసరం లేదు.. ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?
ఇదీ చదవండి: One Nation – One Charger: ఇకపై అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు ఒకటే చార్జర్.. కేంద్రం కొత్త రూల్స్!