ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ నుంచి అత్యంత రహస్యంగా కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర 15 వేల కంటే తక్కువ ధర ఉండడం ఒక ఎత్తైతే, స్టైలిష్ లుక్ తో యూజర్లను కట్టిపడేసేలా ఉంది. అదే.. ‘వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ‘(OnePlus Nord N20 SE). ఇప్పటికే ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,750కు, అమెజాన్‌లో రూ.14,588 ధరకు అందుబాటులో ఉంది.
ఒకప్పుడు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.30,000 కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చేది. ఆ తర్వాత వన్‌ప్లస్ తక్కువ బడ్జెట్‌లో నార్డ్ సిరీస్‌లో మొబైల్స్ రిలీజ్ చేయడంతో యూజర్లు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి 15 వేల కంటే తక్కువ ధరతో వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ లాంచ్ చేసింది. ఇంత తక్కువ ధరలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ఇంకా లాంచ్ చేయలేదు. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. అధికారికంగా లాంచ్ కాకపోవడంతో చాలామందికి ఇంకా తెలియదు. మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచన ఉంటే.. ఇది మంచి ప్రత్యామ్నాయం.
వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ లుక్ పరంగా యూజర్లను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ లో 6.56 ఇంచెస్ ఎల్‌సిడీ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే అందించారు. రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, మీడియాటెక్ హెలియో జి35 ఆక్టాకోర్ ప్రోసెసర్‌పై పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, మరొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా, 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
OnePlus Nord N20 SE is the cheapest OnePlus phone in India, what do you think about the specs? pic.twitter.com/PWZn97HwME
— mysmartprice (@mysmartprice) November 21, 2022