ఒకప్పుడు వన్‌ప్లస్ ఫోన్ కొనాలంటే రూ.30 నుంచి 40 వేల పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ వన్‌ప్లస్ నుంచి కాస్త తక్కువ ధరకే నార్డ్ సిరీస్ మొబైల్స్ వచ్చాయి. దీంతో యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ అయ్యారు. ప్రైస్ కు తగ్గట్టుగా.. ఫీచర్స్, క్వాలిటీ అందించే వన్ ప్లస్ వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో రూ.20,000 బడ్జెట్‌లో నార్డ్ సీఈ 2 5జీ లైట్ మోడల్ తీసుకురానుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ కన్నా కాస్త తక్కువ ఫీచర్స్‌తో ఈ మొబైల్ లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ వచ్చిన.. ఐకూ జెడ్6, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 లాంటి మోడల్స్ ధర రూ.20,000 లోపు ఉండడంతో.. వన్ ప్లస్ లాంచ్ చేయబోయే 5జీ లైట్ కూడా ఇదే రేంజ్‌లో ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 5జీ లైట్ మోడల్ లో రెండు మొబైల్ లాంచ్ చేయనుందని.. (6జీబీ+128జీబీ) ధర 17,999 గా, (8జీబీ+128జీబీ) ధర 19,999 గా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ లైట్ మోడల్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ తో రానున్నట్లు తెలుస్తోంది. స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నా.. వన్ ప్లస్ నుంచి 20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే యూజర్స్ అట్ట్రాక్ట్ అవ్వడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు. అంతేకాక ఇప్పటివరకు మిడ్ రేంజ్ ధరలతో అలరిస్తున్న శాంసంగ్, ఎంఐ వంటి ఫోన్లకు గట్టి పోటీ ఉంటుందంటున్నారు.
.@OnePlus_IN Nord CE 2 Lite has cleared its certification via multiple platforms online which includes camerafv5, FCC, Geekbench 5, and TUV Rheinland.
For more details, checkout – https://t.co/rcV8SjKc4M#OnePlusNordCE2 #OnePlus #giznext#Smartphone #mobilephone
— GizNext (@GizNext) March 17, 2022
OnePlus Nord CE 2 Lite 5G | OnePlus Nord CE 2 Lite 5G First Look Launching With SD 695 5G, 64MP Camera 🔥🔥#OnePlusNordCE2 #NordCE2Lite5G #OnePlusNordCELite5G @OnePlus_IN @YTindiaPage @YTCreatorsIndia @YouTubeIndia @YouTube @YouTubeCreators https://t.co/a5ofhT82YV pic.twitter.com/WQowj0Pwq6
— Techno Anoop (@technoanoop) March 14, 2022