‘వన్‌ప్లస్..’ భారత మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్స్‌లో ఇదొకటి. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వన్‌ప్లస్ నుండి స్మార్ట్ ఫోన్లే కాదు.. స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, టీవీలు, మానిటర్లు.. ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొచ్చింది. దీంతో భారత్‌లో వన్‌ప్లస్ బ్రాండ్స్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. వన్‌ప్లస్ 9వ వార్షికోత్సం సందర్భంగా డిసెంబర్ 13 నుంచి 18 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు గ్యాడ్జెట్లపై క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్‌లతో పాటు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే స్మార్ట్ టీవీలు, ఈయర్ బడ్స్, వాచ్‌లపై భారీగా డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఆ వివరాలు..
It’s that time of the year! OnePlus Community Sale is now live. Visit https://t.co/zMYReDQeSb to get the best offers. pic.twitter.com/PibEF7ocnt
— OnePlus India (@OnePlus_IN) December 13, 2022
వన్‌ప్లస్ 10టీ, వన్‌ప్లస్ 10ఆర్ పై రూ. 5,000 మరియు వన్‌ప్లస్ 10 ప్రో 5Gపై రూ. 6,000 తగ్గింపును అందిస్తోంది. అలాగే.. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఈ రెండింటిపై రూ. 10,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్ సైట్ OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, Amazon.in మరియు పార్టనర్ స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ఈ ఫోన్ అసలు ధర రూ. 49,999కాగా, డిస్కౌంట్‌తో రూ. 44,999కి అందుబాటులో ఉంది. 8జీబీ+128 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో తీసుకుంటే అదనంగా మరో రూ. 10,000 డిస్కౌంట్ పొందొచ్చు.
వన్‌ప్లస్ 10 ప్రో అసలు ధర రూ. 66,999కాగా, డిస్కౌంట్‌తో రూ. 61,999కి అందుబాటులో ఉంది. దీనికి బ్యాంక్ ఆఫర్‌లను కలుపుకుంటే రూ. 55,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే.. ఎక్స్చేంజ్‌లో భాగంగా రూ. 10,000 వరకు అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ అసలు ధర రూ. 28,999కాగా, డిస్కౌంట్‌తో రూ. 25,999కి అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ గల ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌లో అదనంగా రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు.
వీటితో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రొపై రూ. 8,990, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2పై రూ. 4,499, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్‌పై రూ. 2499, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈపై రూ. 1,899, వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లైస్ జెడ్2పై రూ. 1,699, వన్‌ప్లస్ నార్డ్ వైర్డ్ హెడ్‌ఫోన్స్‌పై రూ. 599, వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌పై రూ. 4,499 చొప్పున డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్ సైట్ OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, Amazon.in మరియు పార్టనర్ స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.