భారత్ మార్కెట్‌లో ఐ ఫోన్ తర్వాత అంతటి క్రేజ్‌ను సొంతం చేసుకోవడం వన్ ప్లస్‌కు సాధ్యమైంది. వన్ ప్లస్ నుంచి వచ్చే అన్ని మోడళ్లకు మంచి ఆధరణే లభిస్తోంది. ఒక్కప్పుడు హైరేంజ్‌లో ఉన్న వన్ ప్లస్ ఫోన్లు ఇప్పుడు కాస్త తగ్గించిందనే చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ T- సిరీస్ ఫోన్లు అన్నిటి కన్నా వేగంగా పని చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంఛ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది కంపెంనీ. ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేయనుంది. భారత కాలమాణం ప్రకారం అక్టోబరు 13న జరగనుంది. వన్ ప్లస్ 9RTతో పాటుగా వన్ ప్లస్ బడ్స్ Z2ను కూడా విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ను ఇండియాలోనూ అదే డేట్‌న విడుదల చేస్తుందా.. లేక వేరే రోజును ఎంచుకుంటుందా అనే విషయంపై స్పష్టత లేదు.
వన్ ప్లస్ విడుదల చేసిన ఫొటోలలో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 50 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్, వార్ప్ ఫ్లాష్ ఛార్జ్, 120HZ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 11, 5G సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్, 12 జీబీ ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తోంది. స్పెసిఫికేషన్లపై ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. ధర విషయానికి వస్తే.. అధికారికంగా ధరకు సంబంధించి సమాచారం లేదు. చైనాలో ఈ ఫోన్‌కు అప్పుడే ప్రీబుకింగ్‌లు ఓపెన్ చేశారు. ఏ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో పోన్‌కు సంబంధించిన ఫొటో కూడా లిస్ట్ చేసి ఉంది. చైనాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం వన్ ప్లస్ నుంచి వస్తున్న కొత్త మోడల్ ధర దాదాపు 2 వేల యువాన్ల నుంచి 3 వేల యువాన్లు ఉండొచ్చు. అంటే మన కరెన్సీలో దాదాపు 23 వేల నుంచి 35 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.